మీనాక్షికే షాకిచ్చిన కొండా మురళి
x
Konda Surekha and Konda Murali

మీనాక్షికే షాకిచ్చిన కొండా మురళి

వరంగల్ జిల్లాలో మంత్రి కొండాసురేఖ దంపతులతో మరికొందరు నేతలకు ఏమాత్రం పడటంలేదన్న విషయం అందరికీ తెలిసిందే


తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కే కొండామురళి పెద్ద షాకే ఇచ్చినట్లున్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండాసురేఖ దంపతులతో మరికొందరు నేతలకు ఏమాత్రం పడటంలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రికి వ్యతిరేకంగా ఎంఎల్ఏలు నాయిని రాజేంద్రరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్య తదితరులు ఒకజట్టుగా తయారయ్యారు. మంత్రి వ్యతిరేక గ్రూపులోని ఎంల్ఏలపై మురళి(Konda Murali) బాహాటంగా ఆరోపణలు, విమర్శలు చేయటంతో విభేదాలు రచ్చకెక్కాయి. దాంతో మంత్రి దంపతుపై వ్యతిరేకవర్గం, వ్యతిరేకవర్గంపై మంత్రి దంపతులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చివరకు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ముందుకు వీళ్ళ పంచాయితీ చేరింది.

ఈ నేపధ్యంలోనే గురువారం మీనాక్షితో మంత్రి దంపతులు భేటీ అయ్యారు. వ్యతిరేకవర్గం మీనాక్షికి ఫిర్యాదుచేయగానే మురళిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం ఖాయమనే ప్రచారం బాగా జరిగింది. అలాగే తొందరలోనే కొండాసురేఖ(Konda Surekha)కు మంత్రిపదవి ఊడిపోవటం కూడా ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మీనాక్షితో కొండా దంపతులు భేటీ అవటం ఆసక్తిగా మారింది. భేటీలో మీనాక్షి ఏమడిగిందో మంత్రి దంపతులు ఏమి చెప్పారో తెలీదు. అయితే భేటీ తర్వాత మురళి మీడియాతో మాట్లాడుతు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ బతికించటమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. పార్టీని జిల్లాలో మురళి బతికించటం ఏమిటనే చర్చ పార్టీలో ఊపందుకుంది.

పార్టీని బతికించటం, రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానమంత్రిని చేయటమే టార్గెట్ గా తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన తరగతుల ప్రతినిదిగా తాను 40 ఏళ్ళుగా పనిచేస్తున్నట్లు వివరించారు. తాను బీసీల ప్రతినిధిగా కష్టపడుతున్నాను కాబట్టే తనకు జనబలం ఉందని చెప్పటం సంచలనంగా మారింది. పనిచేసేవారినే తప్పుపట్టడం, నడిచే ఎద్దునే అందర పొడుస్తారనే సామెతను కూడా మురళి మీడియాకు వినిపించారు. తమపైన ఆరోపణలు చేసిన గ్రూపులోని వాళ్ళపైన మంత్రి దంపతులు 16 పేజీల ఫిర్యాదు అందచేశారు. ఇదే విషయమై మురళి మాట్లాడుతు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్ధితితో పాటు నేతల్లో ఎవరేంటి అనే విషయమై డీటైల్డ్ రిపోర్టు ఇచ్చినట్లు చెప్పారు.

రెండువైపుల ఫిర్యాదులను పరిశీలించి నిజాలు తెలుసుకుని ఎవరిది తప్పుంటే వారిపైన చర్యలు తీసుకోమని మీనాక్షికి చెప్పినట్లు మురళి చెప్పట ఆసక్తిగా మారింది. వ్యతిరేక గ్రూపులోని ఎంఎల్ఏలు, నేతలపైన మురళి ఇంత డీటైల్డ్ గా పేరు పేరుతో రిపోర్టు ఇస్తారని బహుశా మీనాక్షి ఊహించుండరు. అందుకనే మురళి మాటలు, రిపోర్టుకు మీనాక్షికి షాక్ కొట్టినట్లుంటుంది. రెండు గ్రూపులు పరస్పరం చేసుకున్న ఆరోపణలపై ఇన్చార్జి ఎప్పుడు విచారణ చేస్తారు ? ఎవరిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే చర్చ పెరిగిపోతోంది. 4వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) హైదరాబాద్ వస్తున్న సందర్భంగా జరగబోతున్న సభకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎంతమంది హాజరవుతారన్నది ఇపుడు టాక్ ఆఫ్ ది పార్టీ అయిపోయింది.

Read More
Next Story