Konda Surekha | కొండా సురేఖపై కేసు పెట్టమన్న కోర్టు
x

Konda Surekha | కొండా సురేఖపై కేసు పెట్టమన్న కోర్టు

అంతకన్నా ముందే నోటీసులు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన న్యాయస్థానం. ఏ కేసులో అంటే..


మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆమె వ్యాఖ్యలకు గానూ కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొండా సురేఖపై ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని శనివాసం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కేసు నమోదు చేసే లోపే ఆమెకు నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. సమంత విడాకుల అంశంలో సినీ నటుడు నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసి ఉన్నారు. కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘‘కోర్టు ఆదేశాల గురించి నాకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఒకసారి నోటీసులు అందిన తర్వాత స్పందిస్తాను’’ అని అన్నారు.

సమంత విడాకులపై సురేఖ ఏమన్నారంటే..

"సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగారు.. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఒత్తిడిపెట్టారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళటం ఇష్టంలేదని సమంత తెగేసి చెప్పారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళకపోతే ఇంట్లో ఉండొద్దని చెప్పటంతోనే సమంత నాగచైతన్యకి విడాకులిచ్చి ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Read More
Next Story