చంద్రబాబు మీద అసంతృప్తి వ్యక్తంచేసిన కొండా సురేఖ
x
Konda displeasure on Chandrababu

చంద్రబాబు మీద అసంతృప్తి వ్యక్తంచేసిన కొండా సురేఖ

మంత్రి లేఖలో అసంతృప్తి వ్యక్తంచేయటం అంటే తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంచేయటంగానే భావించాలి


ఈ విషయంలోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చినా తన ఏలుబడిలోని అధికారులు పాటించకుండా ఉంటారా ? టీటీడీ బోర్డ్ ఛైర్మన్, ఈవో వ్యవహారశైలి చూస్తుంటే వీళ్ళు చంద్రబాబును లెక్కచేయటంలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే చంద్రబాబు, ఛైర్మన్, ఈవో కలిసి నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలూ లేకపోలేదు. తాజాగా తెలంగాణ(Telangana) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) రాసిన లేఖ పై అనుమానాలకు కారణమైంది. విషయంఏమిటంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమల(Tirumala darsan)లో గుర్తించటంలేదని చంద్రబాబు(Chandrababu)కు కొండాసురేఖ నిరసన లేఖ రాశారు. ఈలేఖతో అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తిరుమల శ్రీవారి దర్శనం, కాటేజీల అంశంలో వివాదం కంటిన్యు అవుతునే ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమలలో అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదని ఆరోపిస్తు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖరాశారు. తెలంగాణ మంత్రి చంద్రబాబుకు లేఖ రాసారంటేనే విషయం ఎంత సీరియస్ గా మారుతోందో ? అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారో అర్ధమవుతోంది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు మొత్తుకున్నా, చంద్రబాబుతో రేవంత్ మాట్లాడినా ఉపయోగం కనబడలేదు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారంలో రెండురోజులు ఆనర్ చేయాల్సిందే అని చంద్రబాబు కూడా టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్ నాయడు(Chairman BR Naidu), టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు. అయినా సరే టీటీడీ ఎందుకని తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆనర్ చేయటంలేదన్నదే అర్ధంకావటంలేదు.

తిరుమల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తంచేయటం ఇపుడే మొదలుకాలేదు. 15 మాసాల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మొదలైంది. తమనియోజకవర్గాల నుండి శ్రీవారి దర్శనార్ధం వెళ్ళే వాళ్ళకు తామిస్తున్న సిఫారసు లేఖలను తిరుమలలో అధికారులు గుర్తించటంలేదంటు ఎంఎల్ఏలు యెన్నం శ్రీనివాసులరెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఎంఎల్సీ బల్మూరి ఆనంద్ చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కొందరు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఇదేవిషయాన్ని రేవంత్ తో చెప్పారు. విషయం తీవ్రతను అర్ధంచేసుకున్న రేవంత్(Revanth) కూడా చంద్రబాబుతో మాట్లాడారు.

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారంలో రెండురోజులు ఆనర్ చేయాలని ఛైర్మన్, ఈవోలను చంద్రబాబు ఆదేశించారు. ఆదేశించి చాలాకాలమే అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమలలో అధికారులు బుట్టలో పడేస్తున్నారు. ఇదే విషయమై దేవాదాయ శాఖమంత్రి కొండాసురేఖ లేఖ రూపంలో చంద్రబాబుకు తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. మంత్రి లేఖలో అసంతృప్తి వ్యక్తంచేయటం అంటే తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంచేయటంగానే భావించాలి. ఇక్కడ మౌలికమైన సందేహం ఏమిటంటే చంద్రబాబు ఆదేశించిన తర్వాత కూడా టీటీడీ ఛైర్మన్, ఈవో పాటించకుండా ఉంటారా ?

తెలంగాణ మంత్రి తాజా లేఖను బట్టిచూస్తే టీటీడీ ఛైర్మన్, ఈవో చంద్రబాబు ఆదేశాలను లెక్కచేయటం లేదన్న విషయం అర్ధమవుతోంది. ఇక్కడే రెండు అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే నిజంగానే చంద్రబాబు ఆదేశాలను ఛైర్మన్, ఈవో లెక్కచేయటంలేదా ? లేకపోతే తాను ఆదేశాలిచ్చినా ఏమిచేయాలో అదిచేయండని చంద్రబాబే ఛైర్మన్, ఈవోకు లోపాయికారీగా చెప్పారా ? అన్నదే అర్ధంకావటంలేదు. ముఖ్యమంత్రి ఆదేశించిన తర్వాత ఛైర్మన్, ఈవో అమలుచేయకుండా ఉంటారా ?

Read More
Next Story