రేవంత్ రాకతో మురిసిన కొండారెడ్డిపల్లి
x

రేవంత్ రాకతో మురిసిన కొండారెడ్డిపల్లి

తెలంగాణ షీఎం హోదాలో రేవంత్‌రెడ్డి మొదటిసారి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని శనివారం సందర్శించారు. తమ గ్రామ ముద్దు బిడ్డ రావడంతో గ్రామస్థులు మురిసిపోయారు.


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శనివారం తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు జరుపుకున్నారు.రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక అభివృద్ధి వెలుగులు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి వైపు ప్రసరిస్తున్నాయి. గ్రామంలో సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.


జమ్మి పూజలో పాల్గొన్న సీఎం
దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి మొదటిసారి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్థులు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. తన గ్రామ ప్రజలకు ముకుళిత హస్తాలతో చేతులు ఊపుతూ సీఎం అభివాదం చేశారు. ప్రజల కోరికపై అన్ని అభివృద్ధి పనులు చేస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు. ముందుగా గ్రామంలోని దేవాలయానికి వచ్చిన సీఎం పూజలు చేసిన తర్వాత అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సీఎం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎపీ మల్లు రవి పాల్గొన్నారు.
యువకుల డాన్స్
రాష్ట్రంలోనే కొండారెడ్డిపల్లిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని సీఎం ప్రకటించారు.రేవంత్ రెడ్డి ప్రతీ ఏటా దసరా సంబరాలు చేసుకునేవారు. ఈసారి సీఎం హోదాలో స్వగ్రామానికి రావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా యువకులు డాన్స్ చేశారు.

దుర్గామాత ఆశీస్సులు ఉండాలి : సీఎం ఎక్స్ పోస్ట్
విజయదశమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.‘‘తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. అందరిపై దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. తెలంగాణలో అతి పెద్ద సంబురం, శమీపూజ జమ్మి ఆకుల బంగారం...పాలపిట్ట దర్శనం ప్రజా పాలనలో ఊరూవాడా వెల్లివిరిసిన ఆనందం అని సీఎం పేర్కొన్నారు.

Read More
Next Story