రేవంత్ ఛాలెంజ్‌ స్వీకరించిన కేటీఆర్..
x

రేవంత్ ఛాలెంజ్‌ స్వీకరించిన కేటీఆర్..

వ్యవసాయ రంగం, రైతు భరోసాపై చర్చకు ఎక్కడి రమ్మంటే అక్కడి వస్తా..


సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజీయం కాకరేపుతోంది. అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలతో పాటు సవాళ్లు పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ సభలో పాల్గొన్న సీఎం రేవంత్.. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని, 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగానే రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పనులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలను రేవంత్ ఛాలెంజ్ చేశారు. కాగా తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఎప్పుడు, ఎక్కడ అనేది ఆయనే డిసైడ్ చేయాలని, అందుకోసం మూడు రోజుల సమయం ఇస్తున్నానని కేటీఆర్ వెల్లడించారు. లేని పక్షంలో జులై 8న ఉదయం 11గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని, అక్కడే చర్చిద్దామని ప్రతిసవాల్ చేశారు. ఒక్కరే వచ్చినా.. గుంపులు గుంపులుగా వచ్చినా తాము రెడీ అని, పాలేవో.. నీళ్లేవో తేల్చేస్తామని వ్యాఖ్యానించారు.

‘‘రేవంత్‌తో చర్చించడానికి కేసీఆర్ అవసరం లేదు. మేము నీళ్లు, నియామకాలు, నిధులు అన్న నినాదంతో పోరాటాలు చేశాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హాయంలో.. నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు సన్నిహితులకు మాత్రమే అందుతున్నాయి. రైతులను రాజులుగా చూడాలన్న ఆలోచనతో వారి సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. వాటిలో రైతు బంధు ఒకటి. ఈ పథకానికి ఆక్స్‌ఫర్డ్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. పదేళ్లు కొనసాగిన బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి. కానీ గత18 నెలలుగా ఉన్న ప్రభుత్వం మాత్రం సంక్షేమాన్ని గాలికొదిలేసి టైమ్ పాస్ పాలన చేస్తోంది. ఇందిరమ్మ రాజ్యం అంటే అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు, కాలిపోతున్న మోటార్లు మాత్రమే’’ అని చురకలంటించారు కేటీఆర్.

‘‘ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా?. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోశారు. జల దోపిడీని సీఎం రేవంత్‌ అడ్డుకోవడం లేదు. చోద్యం చూస్తూ కూర్చున్నారు. దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్‌ మహమ్మరిని తరిమికొట్టింది కేసీఆర్‌ కాదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మీ స్తాయికి కేసీఆర్ అవసరం లేదు మేము చాలు.. ఎక్కడికి పిలిచిన రెడీ. 72 గంటల సమయం రేవంత్‌కు ఇస్తున్నాం. ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తున్నా. ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు రైతు భీమా ఎగ్గొట్టి రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్’’ అని దుయ్యబట్టారు.

Read More
Next Story