జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ‘మాగంటి సునీత’
x

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ‘మాగంటి సునీత’

బీఆర్ఎస్ విజయంతో కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలి.


జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలో నిలబెడుతున్నట్లు వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్‌తో ఆయన తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే సునీత అభ్యర్థిత్వంపై స్పష్టతనిచ్చారు. గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తానని సునీత మీ ముందుకు వచ్చారని, ఆమెను అందరూ ఆశిర్వదించండని ప్రజలకు కేటీఆర్ విజ్ణప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించే విజయంతో కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా ప్రజలు ఒకలా తీర్పునిస్తే హైదరాబాద్ ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్‌ను అన్ని స్థానాల్లో ప్రజలు గెలిపించారని అన్నారు. ఈ ఉపఎన్నికతో బీఆర్ఎస్ జైత్రయాత్ర తిరిగి ప్రారంభం కావాలని తెలిపారు.

ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు..

‘‘420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఈ ఉపఎన్నికలో వాళ్లకు ఓటేసి మళ్ళీ అదే పొరపాటు చేయొద్దు. హస్తం గుర్తుకు ఓటేస్తే సంక్షేమపథకాలు అమలు కావు. వచ్చేవి కూడా ఆగిపోవుడు ఖాయం. అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చాక అంధకారంలోకి నెట్టే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ను గెలిపించి ప్రజలు సురుకు పెట్టాలి. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అసరం లేదనుకోవడం ఆ పార్టీ నేతల స్వభావం. కారు కావాలో కాంగ్రెస్, బీజేపీ బేకార్ గాల్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలి’’ అని కేటీఆర్ అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ ఒకటే..

‘‘తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణ రక్షగా, గొంతుకగా ఉన్న కేసీఆర్‌ను ప్రజల్లో లేకుండా, ప్రజలకు చేరవలో లేకుండా చేయాలన్నదే వాళ్ల లక్ష్యం. బీఆర్ఎస్‌ను ఖతం చేస్తే ఇక కాంగ్రెస్‌ను ఈజీగా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో ఏ ఆడబిడ్డా ఆనందంగా లేదు. గీతక్క ,సీతక్క ,సురేఖ అక్క లు మాత్రమే సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్-బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటున్న మోడీని, మోసగాడనే అదానీని రేవంత్ వెనుకేసుకొస్తున్నారు’’ అని విమర్శించారు.

‘‘రాహుల్ బేకార్ అన్న గుజరాత్ మోడల్ ను ప్రశంసించిన రేవంత్, వేటకుక్క అన్న సిబిఐని కేసీఆర్ మీదకే ప్రయోగించారు. దేశంలోని ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసింది. కానీ ఆ సవరణలను దేశంలో అందరికంటే ముందు అమలు చేసిన సీఎం.. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. అలా ఎందుకు చేశారో చెప్పాలని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ మంత్రులు, నేతలను ముస్లీంలు నిలదీయాలి. చరిత్రలో తొలిసారి ముస్లీం మంత్రి లేకుండా.. కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది’’ అని కేటీఆర్ అన్నారు.

Read More
Next Story