ఏసీబీ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్
x

ఏసీబీ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణ నిమిత్తం మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు.


ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణ నిమిత్తం మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయన వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా ఉన్నారు. న్యాయవాదికి కూడా అనుమతివ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. కాగా కేటీఆర్, న్యాయవాది ఇద్దరూ ఒకే గదిలో ఉండరని, కేటీఆర్ కనిపించే అంత దూరంలో లేదా, వేరే గదిలో ఉండి కానీ విచారణను న్యాయవాది చూడొచ్చని తెలిపింది. కోర్టు అనుమతితో న్యాయవాదిని తీసుకుని కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మాట్లాడారు. మరో వెయ్యి కేసులు పెట్టినా తాను ఎదుర్కొంటానన్నారు.

‘‘హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపడం కోసం మంత్రి ఎంతో తాపత్రయపడ్డాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అవి చాలా వరకు ఫలించాయి. బీఆర్ఎస్ హయాంలో ఉండగా ా బావమరుదులకు రూ.1,137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దైర్భాగ్యపు పని నేను చేయలేదు. మంత్రి ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్ట్‌లు ఇవ్వలేదు. దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదు. ఆ తెలివితేటలు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహయరులకే ఉణ్నాయి. నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను. ఏ పని అయినా రాష్ట్రం కోసం చేస్తా. హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచడం కోసం ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహించాం. అరపైసా అవినీతి చేయలేదు. చేయను. కొంతమంది కాంగ్రెస్ నేతలు నాపై కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నాపై బురదజల్లి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేం మాట్లాడుతూనే ఉంటాం. కొట్లాడుతూనే ఉంటాం. లగచర్లలో రైతులను జైల్లో పెట్టినా, హైడ్రా పేరిట పేదల ఇళ్లు కూలగొట్టినా, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయినా అడుగడుగునా సీఎం, ప్రభుత్వాన్ని మేము నిలదీసాం. అందుకే మాపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది రేవంత్ వల్ల కాదు. ఎన్నికల్లో మీరిచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇదికాదు మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగంపై మాకు సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read More
Next Story