బడ్జెట్ కష్టాలు తీర్చేలా లేదు.. కష్టాలు తెచ్చేలా ఉంది : కేటీఆర్
x

బడ్జెట్ కష్టాలు తీర్చేలా లేదు.. కష్టాలు తెచ్చేలా ఉంది : కేటీఆర్

రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చారా. ఇచ్చినట్లు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం’’ అంటూ ఛాలెంజ్ కేటీఆర్ చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక బడ్జెట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. ఈ బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ పేదల కష్టాలు తీర్చేలా లేదని, కాంగ్రెస్ పార్టీ ఆదాయం పెంచేదిలా ఉందని విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి తొక్కేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ మరింత ప్రదాకరమైందని చురకలంటించారు. ఇది ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో స్పష్టమవుతోందని, పెద్దపెద్ద డైలాగులు కొట్టిన ఈ ప్రభుత్వ బడ్జెట్ మాత్రం డీలా పడిపోయిందని ఎద్దేవా చేరశారు.

‘‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. అసలు ఒక ట్రిలియన్‌కి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ సన్నాసులకు, ఎవరో చెబితే వాళ్లు వెనకా మందు.. సాధ్యాసధ్యాలు ఆలోచించుకోకుండా గుడ్డెద్దు చేలో పడినట్లు చదువుకుంటూ పోయారు. ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం కాదు.. ట్రిలియన్ డాలర్ల అప్పుజేసే పరిస్థితి కనిపిస్తుంది. పదేళ్లు పాలించిన కేసీఆర్ రూ.4.17 లక్షల కోట్లు అప్పుజేసే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్ల అప్పు చేసింది. తమ ప్రభుత్వం రూ.1.60లక్షల కోట్లు అప్పు చేసిందని రేవంత్ కూడా అంగీకరించారు’’ అని గుర్తు చేశారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వానికి 20శాతం కమిషన్ పాలన. దేశంలోనే సిగ్గుచేటు పాలన. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజల కష్టాలను తీర్చే బడ్జెట్ కాదు. ఆరు గ్యారెంటీలను గోవిందా అనిపించి ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్. మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు.. నయవంఛన చేయడం. ఢిల్లీలోకి మూటలు మోసుకెళ్లడమని అర్థమయింది. రుణమాఫీ చేశామని సిగ్గులేకుండా చెప్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో అయినా రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చారా. ఇచ్చినట్లు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం’’ అంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్.

Read More
Next Story