‘ట్యాక్స్ కొండంత రిలీఫ్ గోరంత’
x

‘ట్యాక్స్ కొండంత రిలీఫ్ గోరంత’

పెట్రో రేట్లను సెస్సుల రూపంలో పెంచుకుంటూ పోతూ మోదీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోంది. సెస్సులతో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆరోపించారు.


పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ట్యాక్స్‌లు బాదుతున్నారు కానీ ప్రజలకు అందిస్తున్న రిలీఫ్ మాత్రం గుండు సున్నా అంటూ విమర్శలు గుప్పించారు. ఇంధన ధరల పెంపు పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తోందని, పౌరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని కేటీఆర్ అన్నారు. భూటాన్, శ్రీలంక, పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సరే ప్రభుత్వం మాత్రం దేశంలో పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించదు. కేంద్రం విధిస్తూన్న పెట్రో సెస్ కారణంగా రాష్ట్రాలకు తీవ్ర ఆర్థిక అన్యాయం జరుగుతోంది. మినిమం గవర్న్‌మెంట్.. మాగ్జిమం గవర్నెన్స్ అన్న నినాదం మారింది. ఇప్పుడు ప్రభుత్వం పాటిస్తున్న తీరు మ్యాగ్జిమం టాక్సేషన్.. మినిమం రిలీఫ్‌గా ఉంది’’ అని అన్నారు కేటీఆర్.

‘‘పెట్రో రేట్లను సెస్సుల రూపంలో పెంచుకుంటూ పోతూ మోదీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోంది. సెస్సులతో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. పైగా రాజకీయ అజెండాల ప్రచారాలకు వాటిని వినియోగించుకుంటుంది. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వకుండా దే సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి గణనీయంగా సహకరిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల నిధుల కొరతతో అల్లాడుతున్నాయి’’ అని కేటఆర్ అన్నారు. ప్రభుత్వం ఆకట్టుకునే నినాదాల వెనక దాక్కోవడం మానుకుని పని చేయాలని హితవు పలికారు.

Read More
Next Story