మిల్లా మ్యాగీ ఆరోపణలపై విచారణ జరగాలి: కేటీఆర్
x

మిల్లా మ్యాగీ ఆరోపణలపై విచారణ జరగాలి: కేటీఆర్

బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను.


హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పోటీల్లో హెడ్ టు హెడ్ పోటీ కోసం టాప్ 20 ఫైనలిస్ట్‌లను కూడా షో ఆర్గనైజర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనికన్నా ఈ పోటీ నుంచి మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ తప్పుకోవడం సంచలనంగా మారింది. పోటీ దారులను ఆర్గనైజర్స్ ట్రీట్ చేసిన తీరు అత్యంత దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీ కోసం తెలంగాణకు వచ్చిన మహిళలకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం అత్యంత దారుణమని, దీనిపై తాను ఎంతగానో బాధపుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

‘‘మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి. మిల్లా మ్యాగీ ఒక బలమైన మహిళ, మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నాము. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాము, గౌరవిస్తాము, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాము. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే. దురదృష్టవశాత్తు, మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.

అసలుమిల్లా ఏమన్నారంటే..

74ఏళ్లుగా జరుగుతున్న ఈ పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే మొదటిసారి. పోటీల నుంచి తప్పుకోవడంపై మిల్లా మ్యాగీ క్లారిటీ ఇచ్చారు. ‘‘ధనవంతులైన పురుష స్పాన్సర్ల ముందు పరేడ్ చేసి నిల్చుని ఉండటం చాలా దారుణంగా అనిపింది. ఆ క్షణం నేనేమైనా వేశ్యనా అన్న భావన కలిగింది. మమ్మల్ని వీళ్లు ఎంటర్‌టైన్మెంట్ కోసం తెచ్చుకున్న కోతుల్లా చూస్తున్నారా? అనిపింది. ఈ ప్రోగ్రామ్ అంతా ఔట్‌డేటెడ్. అంతేకాకుండా చాలా మందిని బోరింగ్‌గా ఉన్నారంటూ తిట్టడం కూడా జరిగింది. ఇక నావల్ల కాదు అనుకున్నా. తప్పుకున్నా. మమ్మల్ని 24 గంటలూ మేకప్ వేసుకునే ఉండమన్నారు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్స్ వేసుకునే ఉండాలని చెప్పారు. ఆ తర్వాత షో కోసం భారీగా ఖర్చు చేసినందుకు మధ్యవయసు వ్యక్తులను థాంక్యూగా ఎంటర్‌టౌన్ చేయమన్నారు. అది చూసిన ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. ఇది చాలా తప్పనిపించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ మమ్మల్ని ట్రీట్ చేసిన తీరు చూసి నేనేమైనా వేశ్యనా అన్న అనుమానం వచ్చింది. ఒకసారి మాట్లాడి చూద్దాం అనుకున్నా కానీ ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు. అందుకే బయటకు వచ్చేశా. డిఫరెంట్ ఫ్యూచర్‌ని క్రియేట్ చేయాలనుకంటున్నా. అసలు మమ్మల్ని వాళ్లు చాలా అగౌరవంగా చూశారు. అప్పుడు మిస్ వరల్డ్ నిజస్వరూపాన్ని కనిపించింది’’ అని మిల్లా చెప్పుకొచ్చారు.

Read More
Next Story