KTR
x

నెమళ్లు సహాయం కోరుతున్నాయి.. కేటీఆర్

రాష్ట్రంలో గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతూ చేస్తున్న రణగొణ ధ్వనులతో వన్యప్రాణులు వణికిపోతున్నాయి.


కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్ర యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిలో ప్రభుత్వం చేపట్టిన చదును పనులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హెస్‌సీయూ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికయినా స్పందించాలని డిమాండ్ చేశారు. వారి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే.. ఆయన ఏం చేస్తున్నారని, చోద్యం చూడటం మానుకుని స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ భూముల వ్యవహారంపై కేటీఆర్.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో విచ్చలవిడిగా గ్రీన్ మర్డర్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన చదును పనులు.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వన్యప్రాణులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు.

‘‘400 ఎకరాల భూమిని నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతూ చేస్తున్న రణగొణ ధ్వనులతో వన్యప్రాణులు వణికిపోతున్నాయి. నెమళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికయినా రాహుల్ గాంధీ నోరు విప్పాలి. ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఆయన మాట్లాడకపోతే ఎలా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే ఈ భూముల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ భూముల వేలాన్ని బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంతలో ఈ భూములు యూనివర్సిటీకి చెందినవి కాదని, ప్రభుత్వానివేనని టీజీఐఐసీ చేసిన ప్రకటన ఈ అంశాన్ని కీలక మలుపు తిప్పింది. దీంతో పచ్చదనాన్ని కాంగ్రెస్ నాశనం చేస్తుందన్న వాదన మొదలైంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More
Next Story