![KTR | కేటీఆర్ గారు ఇంత ఘనం మీ ఆస్తులు ఎలా పెరిగాయి? KTR | కేటీఆర్ గారు ఇంత ఘనం మీ ఆస్తులు ఎలా పెరిగాయి?](https://telangana.thefederal.com/h-upload/2025/02/13/512470-ktr.webp)
KTR | కేటీఆర్ గారు ఇంత ఘనం మీ ఆస్తులు ఎలా పెరిగాయి?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి ఎక్స్ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు.
2009వ సంవత్సరంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ప్రస్థుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆస్తులు రూ.4.35కోట్లు ఉంటే, ప్రస్థుతం 53.31 కోట్లకు ఎలా పెరిగాయని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి ఎక్స్ లో ప్రశ్నించారు.
‘‘మీ ఆస్తులు ఇంత ఘనం పెరగడానికి ఇలాంటి వ్యాపారాలేనా..?? ఇంకా ఏమైనా బయటకు రావాలిసినవి ఉన్నయా...??’’అంటూ ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ను ఉద్ధేశించి పెట్టిన ఎక్స్ పోస్టులో ‘‘భీమవరం నుంచి బోస్టన్ దాకా స్పందించే మీరు... దీనికి కూడా స్పందిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్టును కేసీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి, వేం నరేందర్ రెడ్డికి, మన్నె సతీష్ లకు ట్యాగ్ చేశారు.
Mr. @KTRBRS గారు. ...
— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) February 13, 2025
* 2009లో మీ ఆస్తులు 4.35 కోట్లు
* 2023లో మీ ఆస్తులు 53.31 కోట్లు
* మీ ఆస్తులు ఇంత ఘనం పెరగడానికి ఇలాంటి వ్యాపారాలేనా. .?? ఇంకా ఏమైనా బయటకు రావాలిసినవి ఉన్నయా. ..??
(( *హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాం హౌస్‌లో కోడి పందేలు, భారీ గా నగదు పట్టివేత.*
*30… pic.twitter.com/I9ZqgQqVKI