‘నదీ జలాలపై రేవంత్‌కి అవగాహన శూన్యం..’
x

‘నదీ జలాలపై రేవంత్‌కి అవగాహన శూన్యం..’

సాగునీటిపై మంత్రులది అంతులేని అజ్ఞానమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.


తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నదీ జలాలపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన శూన్యమని, అదే విధంగా మంత్రులది అంతులేని అజ్ఞానం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసుల డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కేసులు, బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదని పాలమూడు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు.

నల్లగొండలో కొత్తగా ఎన్నికయిన సర్పంచ్‌లు, వార్డమెంబర్లకు అభినందన సభ నిర్వహించింది బీఆర్ఎస్. అందులో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. "ముఖ్యమంత్రి వెనుక నుండి లీకులు ఇచ్చి, కేసులతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి, కేవలం కేసుల చుట్టూ ప్రభుత్వాన్ని తిరుగుతున్నారు" అని అన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై నిరసన

కృష్ణా నదీ జలాల సమస్య, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు వంటి కీలక సాగునీటి పథకాలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 90 శాతం పూర్తి అయినప్పటికీ, మిగిలిన 10 శాతం పనులు ఈ ప్రభుత్వం అడ్డుకుంటోంది. కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం గర్జిస్తుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి నిరాధార కేసుల ద్వారా బెదిరింపులు చేస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు. డీపీఆర్ (DPR) పంపడంలో విఫలమవడమే కాకుండా, ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నారని విమర్శించారు.

రైతుల కష్టాలు పట్టవా

నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల కష్టాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. ఇది ప్రభుత్వానికి ఓటమి భయంతో ఆలస్యం చేస్తోందని స్పష్టమవుతోంది" అని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి శాఖ మంత్రికి కనీస అవగాహన లేదని, మీడియా సమావేశంలో నీటిప్రశ్నలకు "నేను ప్రిపేర్ అయి రాలేదు, రేపు సమాధానం చెబుతాను" అని తప్పించుకున్నారని ఎద్దేవా చేశఆరు. మరొక మంత్రిని "వాటర్ లో నీళ్లు" అంటూ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వారు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి హుంకరిస్తున్నారని, అబద్ధాలు చెప్పి గందరగోళం సృష్టించడం తప్ప వీరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

కేసీఆర్ గర్జిస్తే సమాధానం లేదు

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ప్రభుత్వానికి లేదని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. "కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ గర్జిస్తున్నారు. దానికి సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ గారిపై నిరాధారమైన కేసుల లీకులు ఇస్తున్నారు" అని దుయ్యబట్టారు.

Read More
Next Story