
హెచ్‌సీఏ అవకతవకల్లో కేటీఆర్, కవితల పేర్లు
సీఐడికి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
హెచ్‌సీఏలో అవకతవకలకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మందిపై సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఫిర్యాదు చేసింది. ఈరోజు సీఐడీ చీఫ్ చారు సిన్హాను టీసీఏ అధికారులు కలిసి హెచ్‌సీఏ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఉహించని ఈ పరిణామంతో సిఐడి అధికారులు ఖంగుతిన్నారు.
హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని వారు ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా జగన్‌మోహన్ రావు గెలిచిన వెంటనే ‘నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకు అంకితం చేసినట్లు’ చెప్పారని టీసీఏ ఫిర్యాదులో పేర్కొంది. హెచ్ సి ఏ అవకతవకల్లో అన్నా చెల్లెల్ల పేర్లు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది.
Next Story