KTR | ‘సీఎంకు తెలంగాణ రైతాంగం తగిన బుద్ది చెప్తది’
x

KTR | ‘సీఎంకు తెలంగాణ రైతాంగం తగిన బుద్ది చెప్తది’

కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు కేసీఆర్ కన్న బిడ్డల్లా కాపాడుకుంటే.. కాంగ్రెస్ మాత్రం వారికి రాచిరంపాన పెడుతోందని విమర్శించారు. ఆ హామీ ఈ హీమీ అని అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్.. హామీల అమలుకు వచ్చేసిరికి కథలు చెప్తోందని ఎద్దేవా చేశారు. వందశాతం రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెప్పుకంటుందని, అలాంటప్పుడు లోన్ కట్టలేదన్న సాకుతో రైతుల ఇళ్ల గేట్లు, నీటి పన్ను కట్టలేదని మోటర్ స్టార్టర్లను ఎందుకు ఎత్తుకెళ్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రైతులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.

‘‘నిన్న గేటు ఎత్తుకెళ్లారు..!

నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు..!!

ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా ??

తెలంగాణ ఆడబిడ్డలారా...!

ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలం..!!

అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా ?

కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్ కు ఇంత కోపమా ??

సాగు నీళ్లిచ్చే సోయి లేదు..

పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు.. కానీ..

రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా ?

బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువాను..

ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా ??

తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా ?

ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా ??

2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని..

సన్నాసులు ఇంత దారుణానికి ఒడిగడతారా ??

రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి..

రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా ??

పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి..

మళ్లీ అప్పులపాలయ్యేలా చేసిన పాపం మీది కాదా కాదా !!

ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటి ?

మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి ?

వ్యవసాయరంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి..

సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను..

తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదు

సంఘటితంగా పోరాడుతది..! సీఎంకు బుద్ధి చెబుతది..!!’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story