‘బీజేపీ పెద్దల కాళ్లుమొక్కడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్లారు’
x

‘బీజేపీ పెద్దల కాళ్లుమొక్కడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్లారు’

రేవంత్ రెడ్డి అవినీతిలో బీజేపీ నేతల భాగస్వామ్యం ఉండటం వల్లే కేంద్రం మౌనంగా ఉందా.


కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ విషయంలో చర్యలు తీసుకోవడానికి బీజేపీ ఆలోచిస్తుండటం ఇందుకు అతిపెద్ద నిదర్శనం అని అన్నారు. తెలంగాణలో ఎంత అవినీతి జరుగుతున్నా కేంద్రం మాత్రం తనకు పట్టనట్లు ప్రవర్తిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ కేసుల ఛార్జ్‌షీట్‌లో ఈడీ.. రేవంత్ పేరు కూడా చర్చిందని, అయినా ఆయనపై ఇప్పటి వరకు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది తెలంగాణకు అవమానేమనని అన్నారు.

‘‘గతంలో ఎన్నో తప్పులు చేసిన రేవంత్ రెడ్డికి ఇప్పటికీ బుద్ధి రాలేదు. 2015 ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డిని బ్యాగ్ మాన్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు సీటుకు నోటు కుంభకోణంలో ఇరుక్కున్నారు. తెలంగాణ ఏఐసీసీకి ఎటిఎంలా మారింది. యడ్యూరప్ప విషయంలో కాంగ్రెస్ వైఖరి ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో అవలంబించాలి. నైతికత ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. చీకట్లో బిజెపి పెద్దల కాళ్ళు పట్టుకోవటానికి ఢిల్లీ వెళ్ళారు. రాత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు’’ అని విమర్శించారు.

‘‘రాహుల్ గాంధీ, మోదీ, అమిత్ షా ను ప్రసన్నం చేసుకోవటానికే రేవంత్ 42 సార్లు డిల్లీ వెళ్ళారు. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండగానే సోనియా, రాహుల్ గాంధీపై ఈడి కేసు పెట్టింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నైతికత ఉంటే రేవంత్ రెడ్డిని తొలగించాలి. కాంగ్రెస్ డిఎన్ఏ లోనే కరప్షన్ ఉంది. రేవంత్ రెడ్డి విషయంలో బిజెపి ఎందుకు మౌనంగా ఉంటోంది. రేవంత్ రెడ్డి అవినీతిలో బిజెపి నేతల భాగస్వామ్యం ఉండటం వల్లే మాట్లాడటం లేదా. తెలంగాణలో ఎన్ని స్కాంలు జరుగుతున్న కేంద్రం ఎందుకు స్పందించటం లేదు. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు గమనించాలి. తెలంగాణలో జరుగుతున్న స్కాంల పై నెల రోజుల్లో కేంద్రం స్పందిస్తుందా లేదా చూస్తాం. స్పందించకపోతే మా పార్టీలో చర్చించి కార్యాచరణ చేపడతాం’’ అని తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డి లొట్ట పీసు ముఖ్యమంత్రి. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి..శని కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చు’’ అని అన్నారు.

‘‘50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా ముందటనే చెప్పిండు. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలకు, ఇప్పుడు చార్జి షీట్ తో ఈ.డి ఆధారాలు చూపించింది. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ ని అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు అన్న వివరాలను ఈడి తన చార్జిషీట్లో స్పష్టంగా బయటపెట్టింది. తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలో మారింది. ఢిల్లీ కాంగ్రెస్కు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు భారీ మొత్తంలో అందిస్తూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఓటుకు నోటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, కానీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. యావద్దేశం ముందు తెలంగాణ పరువు తీశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మూటలు ఇచ్చే పిసిసి పదవి పొందారనీ వెంకట్ రెడ్డి చెప్పిండు.మూటలు పంపుతూ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నారనీ దేశమంతా తెలుసు.ఆఫీస్ బేరర్ల నుంచి మూటలు తీసుకొని ఆనాడు కాంగ్రెస్ పత్రికకు నిధులు అందించారని ఈడీ చెప్పింది. 17 నెలల్లోనే 44 సార్లు ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. ఒక్క ఇటుక పేర్చకుండానే, ఒక కొత్త ప్రాజెక్టులు కట్టకుండానే, ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండానే, ఒక్క హామీని అమలు చేయకుండానే… లక్ష 80 వేల కోట్ల అప్పు చేసిండు. ఈ డబ్బులు అన్ని ఎక్కడికి పోతున్నాయో ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు.

Read More
Next Story