ఆటో డ్రైవర్ల మహాధర్నాలో కేటీఆర్.. ఏం డిమాండ్ చేశారంటే..
x

ఆటో డ్రైవర్ల మహాధర్నాలో కేటీఆర్.. ఏం డిమాండ్ చేశారంటే..

ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు అంతా కలిసి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు.


ఆటో డ్రైవర్లు(Auto Drivers), ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు అంతా కలిసి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా(Mahadharna) నిర్వహించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని వారు తమ గోడు చెప్పుకున్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 2 లక్షల మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

వీరంతా కూడా మహాలక్ష్మీ పథకం అమలు కాకముందు సగటున రూ.1000 సంపాదించేవారు. ఇప్పుడు వారికి రూ.500 కూడా రావడం లేదు. ఇందుకు ప్రభుత్వం తెచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకమే కారణమని వాళ్లు పేర్కొంటున్నారు. దీంతో తమకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఆ అంశం ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేటు డ్రైవర్లు. వెంటనే తమకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూనే వారు ఈ మహాధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులకు తమ మద్దతు, అండ తప్పకుండా ఉంటాయని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క హామీ నెరవేరలేదు: కేటీఆర్

‘‘నేను ఇక్కడికి ఆటోలోనే వచ్చాను. తమ జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోజూ రెండు పూట్లా తినాలంటే మూడు పూట్లా శ్రమించాల్సి వస్తున్న పరిస్థితులను నాకు ఆటో డ్రైవర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ.. హైదరాబాద్‌కు వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇదే రాహుల్ గాంధీ.. ఆటోలో ప్రజల దగ్గరకు వచ్చి ఎన్నో కబుర్లు చెప్పారు. మరెన్నో హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇంటింటికి సంక్షేమం అన్నారు, అత్తలకు, కోడళ్లకు పైసలన్నారు. కానీ ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం కాన్నా సంక్షోభాన్ని ఎక్కువగా తెలస్తోంది’’ అని మందిపడ్డారు. అంతేకాకుండా తాము మహాలక్ష్మీ పథకానికి వ్యతిరేకం కాదని, కాకపోతే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మొదలయ్యాయని, వాటిని నియంత్రించేలా వారి సమస్యలకు పరిష్కారం చూపాలనే తాము డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఏడాదికి రూ.12 వేల కాదు ఇవ్వాల్సింది..

‘‘ఫ్రీబస్సుకు సంబంధించి వివరాలను అసెంబ్లీలో పెడితే విమర్శలు చేశారు. ఆడ పిల్లలు మహాలక్ష్మీ పథకం వల్ల బస్సుల్లో కొట్టుకోకుండా చూడాలి. ఆటో డ్రైవర్లకు చావే గతికాకుండా అడ్డుకోవాలి. అందకోసం వారికి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వడం కాదు. నెలకు రూ.5 వేలు ఇవ్వాలి. దాంతో పాటుగా ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. కేసీఆర్ తెచ్చని బీమాను కూడా రద్దు చరేశారు. తెలంగాణలో పోలీసులు కూడా కష్టాల్లోనే ఉన్నారు. వాళ్ల కుటుంబీకులు కూడా రోడ్డెక్కారు. సచివాలయంలో స్పెషల్ పోలీసులను తొలగించి బెటాలియన్‌ను దించారు’’ అని కేటీఆర్ అన్నారు.

వాళ్ల కెపాసిటీ మాకు తెలుసు

‘‘ఆటో డ్రైవర్ల సామర్థ్యం ఏంటో మాకు బాగా తెలుసు. మమ్మల్ని ఓడించడంలో వారి పాత్ర కూడా ఉంది. ఇదే ప్రభుత్వాన్ని ఇంకా నాలుగేళ్ల భరించాలి. ఈ నాలుగేళ్లు కూడా ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. అన్ని జెండాలు ఒక్కటై పోరాటం చెయ్యాలి. కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలి. ప్రభుత్వంతో కలిసి ఉన్నా ఏఐటీయూసీ ఉద్యమించడానికి రోడ్డెక్కింది. సీఐటీయు వంటి సంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. వారందరికీ బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం అంతా కలిసి నినాదిద్దాం’’ అంటూ కేటీఆర్ నినాదాలు చేశారు.

Read More
Next Story