KTR|రాజకీయాలకు కేటీఆర్ బ్రేక్
x
BRS Working President KTR

KTR|రాజకీయాలకు కేటీఆర్ బ్రేక్

తెల్లవారింది మొదలు మీడియా సమావేశాలు, పార్టీ నేతలు, క్యాడర్ తో సమావేశాలు, జిల్లాల పర్యటనలతో బహుశా బుర్రంతా వేడెక్కిపోయుంటుంది.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాల నుండి కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. 24 గంటలూ బిజీబిజీగా గడిపే కేటీఆర్(KTR) తనకు కాస్త విశ్రాంతి అవసరమని అనుకున్నట్లున్నారు. 2014-23 వరకు మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విపరీతమైన బిజీగా ఉండేవారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కూడ బిజీగానే ఉంటున్నారు. తెల్లవారి లేస్తే రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై ఏవో ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. తెల్లవారింది మొదలు మీడియా సమావేశాలు, పార్టీ నేతలు, క్యాడర్ తో సమావేశాలు, జిల్లాల పర్యటనలతో బహుశా బుర్రంతా వేడెక్కిపోయుంటుంది.

ఇంట్లో వాళ్ళు కూడా లాంగ్ బ్రేక్ తీసుకోమని చెప్పినట్లున్నారు. అందుకనే సడెన్ గా ట్విట్టర్(Twitter) వేదికగా తాను రాజకీయాల నుండి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. తన బ్రేక్ ను ప్రత్యర్ధులు మరీ ఎక్కువగా సంతోషించాల్సిన అవసరం లేదన్నట్లుగా చెప్పారు. కేటీఆర్ ట్వీట్ కు మద్దతుదారులు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

Read More
Next Story