కేటీఆర్ డైరీ వ్యూహం వర్కవుట్ అవుతుందా?
x

కేటీఆర్ 'డైరీ' వ్యూహం వర్కవుట్ అవుతుందా?

పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు కేటీఆర్ డైరీ వ్యూహం ఫలిస్తుందా?


బుధవారం ఒస్మానియా యూనివర్సిటీలో పోలీసుల దాడిలో గాయ‌ప‌డ్డ బీఆర్ఎస్వీ నాయ‌కుల‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. గురువారం నందినగర్ లోని నివాసంలో వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా.. లేక రేవంత్ రెడ్డి సన్నాసా చెప్పాలన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ వారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులతో విద్యార్థులను, నిరుద్యోగులను దగా చేస్తున్నాడన్నారు. నేడు విద్యార్ధులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైరీలో నమోదు చేస్తున్నారు.. అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టం అని హెచ్చరించారు. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మీ పోరాట ప‌టిమను అనేక సంద‌ర్భాల్లో చూపించారని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను కేటీఆర్ ప్రశంసించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన‌ప్పుడు, గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాల‌ని, డీఎస్సీ వాయిదా వేయాల‌ని మీరు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై పోరాడుతూనే ఉండాల‌ని కేటీఆర్ సూచించారు. ఎల్ల‌ప్పుడూ పార్టీ అగ్ర నాయ‌క‌త్వం బీఆర్ఎస్వీ నాయ‌కుల‌కు అండ‌గా ఉంటుంద‌ని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు.

కేటీఆర్ 'పోలీస్ డైరీ':

కాగా, యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ రెడ్ బుక్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. "టీడీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టిన అధికారులను అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తే లేదు. మా కార్యకర్తలని అన్యాయంగా వేధించిన పోలీస్ అధికారుల లిస్ట్ ఈ రెడ్ బుక్ లో ఉంది. ఎవ్వరినీ వదిలిపెట్టం" అంటూ రెడ్ బుక్ రూపంలో టీడీపీ కార్యకర్తలకి నారా లోకేష్ భరోసా కల్పించారు. తెలంగాణాలో బీఆర్ఎస్ కూడా అదే పంథాలో బ్లాక్ బుక్, డైరీ అంటూ కార్యకర్తలకి ధైర్యమిచ్చే ప్రయత్నం చేస్తోంది. చూడాలి కేటీఆర్ డైరీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Read More
Next Story