పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు
x

పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు

పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు ఉండటం సంచలనం రేపింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేకుట్రలో కేటీఆర్‌ ఆదేశాలున్నట్టు రిపోర్ట్ పేర్కొంది.


పట్నం నరేందర్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగుచూశాయి. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్‌ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌ లో పేర్కొన్నారు..

- కలెక్టర్‌పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా, సాక్షుల విచారణలో కుట్రదారు పట్నం నరేందర్‌రెడ్డిగా తేలిందని పోలీసు రిమాండ్ రిపోర్టు పేర్కొంది.
- రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని, పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్‌ ద్వారా ప్రభావితం చేశారని రిపోర్టులో వెల్లడైంది.కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పారని, అధికారులను చంపినా పర్వాలేదని..రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసులు తెలిపారు.



Read More
Next Story