ఎమ్మెల్యే ఆత్మాహుతి బెదిరింపు
x

ఎమ్మెల్యే ఆత్మాహుతి బెదిరింపు

తాను భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్దమన్న మాధవరం కృష్ణారావు


కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తాను ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు. తాను భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై కూకట్‌పల్లి కృష్ణారావు ఘాటు స్పందించారు. తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనపై చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని కొట్టిపారశారు. తాను ప్రజల కోసమే పనిచేశానని, తానంటే ఏంటో ప్రజలకు బాగా తెలుసని అన్నారాయన. కబ్జాల ఆరోపణలపై గురువారం ఆయన స్పందించారు. ఇద్దరు నేతలు కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐీపీఎల్ భూముల్లో పేదలు నివాసం ఉంటున్నారని, వారి జోలికి వెళ్తే తాను ఆత్మాహుతి చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

రూ.4వేల కోట్ల విలువైన భూముల ఆక్రమణ వివాదంపై లోతుగా దర్యాప్తు జరగాల్ని ఆయన కోరారు. కొందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలను పాల్పడుతున్నారని, ఈ అంశంపై తాను గతంలోనే చాలా సార్లు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. ఆ భూముల్లో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణాల కోసం నిధులు తీసుకొచ్చానని కూడా చెప్పారు. అంతేకాకుండా తాను ఐడీపీఎల్ ఉద్యోగులను బెదిరించానని వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ఆ వార్తలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు.

అసలు ఆరోపణలు ఏంటంటే..

హైదరాబాద్‌ను ఫార్మా క్యాపిటల్‌గా నిలబెట్టిన ఐడీపీఎల్‌ (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయని ఉద్యోగులు ఘోర ఆరోపణలు చేస్తున్నారు. 1961లో ఏర్పాటు చేసిన ఐడీపీఎల్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మూసాపేట, బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లో 902 ఎకరాలు కేటాయించగా, పరిశ్రమ మూతపడిన తర్వాత భూముల విలువ పెరగడంతో ప్రభావశీలులు, రియల్టర్లు, కొందరు నేతలు కలిసి భూములను కబ్జా చేస్తున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే 150 ఎకరాలు అక్రమంగా చేతులు మారాయని, వీటి విలువ సుమారు రూ.4,000 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ దందాలో కొంతమంది ఐడీపీఎల్ ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, కలెక్టర్, పోలీసులు, డీజీపీ వరకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఐడీపీఎల్ భూములను రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story