రేవంత్ ఇలాఖాలో ఉద్రిక్తత.. కలెక్టర్‌పై రాళ్ల దాడి..
x

రేవంత్ ఇలాఖాలో ఉద్రిక్తత.. కలెక్టర్‌పై రాళ్ల దాడి..

సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖా లగచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్‌పై స్థానికులు దాడి చేశారు. వాహనాల వెంటపడి మరీ రాళ్లతో దాడులకు పాల్పడ్డారు.


సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖా లగచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకోవానికి లగచర్ల వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చేదు అనుభవం మొదలైంది. కలెక్టర్‌కు స్థానికుల నిరసన సెగ గట్టిగా తగిలింది. ఆయనపై గ్రామస్తులు, రైతులు దాడులు చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై లగచర్ల పోలెపల్లి, దుద్యాల, లగచర్ల తండాలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం కెలక్టర్ ప్రతీక్ జైన్, తహశీల్దార్, ఇతర అధికారులు వెళ్లారు. వారిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఒక మహిళ.. కలెక్టర్‌పై చేయి చేసుకుందని కూడా సమాచారం.

కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులంతా కూడా అక్కడి వెనుదిరిగారు. దీంతో లగచర్లలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అయితే కలెక్టర్, అధికారులు గ్రామానికి రాగానే వారికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఆయన పైకి దూసుకెల్లారు. కలెక్టర్ మాట్లాడే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. పరిస్థితులు చేయిదాటేలా కనిపించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కలెక్టర్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అయినా ఆగని రైతులు, ప్రజలు కర్రలు పట్టుకుని అధికారుల వాహనాల వెంటపడి మరి దాడి చేశారు. అయితే కలెక్టర్, అధికారులు సరైన బందోబస్తు లేకుండా వెళ్లడం వల్లే ఇటువంటి ఘటన జరిగిందని కొందరు అంటున్నారు. పోలీసుల భద్రత పెద్దగ లేదని గమనించడంతోనే ఆందోళనకారులు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారని అంటున్నారు.

Read More
Next Story