
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు స్ధలం ఎంపిక
జనవరి 18వ తేదీ ఎన్టీఆర్ వర్ధంతి రోజున విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉండిపోయిన హామీని రేవంత్ నెరవేర్చబోతున్నారు. అమీర్ పేట మైత్రీవనం జంక్షన్లో అన్న ఎన్టీఆర్(NTR statue) విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మైత్రీవనం జంక్షన్లో అన్నగారి విగ్రహం ఏర్పాటు విషయాన్ని జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ వల్లాల నవీన్ యాదవ్(Jubilee Hills MLA Naveen Yadav) ఆదివారం పరిశీలించారు. నగరంలోని కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులు, అన్నగారి అభిమాన సంఘాల్లోని ప్రముఖులు, స్ధానికులతో నవీన్ (Ameerpet)అమీర్ పేట, మైత్రీవనంలో(Mitrivanam) ర్యాలీ నిర్వహించారు. మైత్రీవనం జంక్షన్లో విగ్రహం ఏర్పాటు చేస్తానని ఈమధ్యనే రేవంత్ హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. హామేని నిలుపుకోవటంలో భాగాంగానే నవీన్ స్ధలం ఎంపిక విషయాన్ని రేవంత్ కు వివరించారు. తొందరలోనే ముహూర్తం చూసుకుని విగ్రహఏర్పాటు పనులు మొదలవ్వబోతున్నట్లు సమాచారం.
ఈమధ్యనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులతో జరిగిన భేటీలో రేవంత్ మాట్లాడుతు అన్నగారి విగ్రహాన్ని మైత్రీవనం చౌరస్తాలో ఏర్పాటు చేయిస్తానని హామీఇచ్చారు. విగ్రహ ఏర్పాటు బాధ్యతను రేవంత్ పోటీచేసిన నవీన్ కు అప్పగించారు. తర్వాత జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ 25వేల ఓట్ల మెజారిటితో గెలిచాడు. అప్పుడు ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు నవీన్ కొందరు ప్రముఖులతో మైత్రీవనంలో పెద్ద ర్యాలీ నిర్వహించి జంక్షన్లో విగ్రహ ఏర్పాటును పరిశీలించారు. జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేవంత్ చేతుల మీదగా విగ్రహావిష్కరణ లక్ష్యంగా పనులు మొదలయ్యాయి.

