ఎన్నికల విధులు నిర్వహించిన టీచర్లపై లాఠీ ఛార్జ్
x

ఎన్నికల విధులు నిర్వహించిన టీచర్లపై లాఠీ ఛార్జ్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం పోలింగ్ విధులు నిర్వర్తించిన తమకు రావాల్సిన డబ్బుల కంటే తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.

ఎన్నికల విధులను నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రూ.3,150 చెల్లించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని టీఎస్‌యూటీఎఫ్‌తో సంబంధం ఉన్న ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా ఇదే అమలు కాగా, నారాయణఖేడ్‌లో అధికారులు.. పీఓలు, ఏపీఓలకు కేవలం రూ.2,400 మాత్రమే చెల్లించారని ఆరోపించారు.

ఉపాధ్యాయులు వారిని ప్రశ్నించగా అదనపు సొమ్ము చెల్లించేందుకు నిరాకరించారు. దీంతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తూ అర్థరాత్రి వాగ్వాదానికి దిగారు. అయితే ఈవీఎంలను అక్కడే ఉంచడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు.

టీఎస్‌యూటీఎఫ్‌ ట్రెజరర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. "పోలింగ్‌ సిబ్బందికి జీతాలు ఇచ్చే పనిని అప్పగించిన ఇద్దరు తహశీల్దార్లు, అదనపు మొత్తం చెల్లిస్తామంటూ టీచర్లను ఈవీఎంల దగ్గరికి తీసుకెళ్లి పోలీసులతో లాఠీచార్జి చేయించారు" అని ఆరోపించారు.

పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. లాఠీ ఛార్జ్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story