ప్రియుడి కోసం చంటి బిడ్డను రోడ్డుపై వదిలేసి
x

ప్రియుడి కోసం చంటి బిడ్డను రోడ్డుపై వదిలేసి

ఇన్ స్టాగ్రాంలో పరిచయమై


ప్రియుడి కోసం కన్నబిడ్డను రోడ్డుపై వదిలేసి తల్లి గాథ ఇది. నల్గొండలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన తల్లి బిడ్డల బంధాన్నే చెరిపేసింది. రెండేళ్ల కుమారుడిని బస్టాండ్‌లో వదిలేసిన ఆ కన్నతల్లి ప్రియుడితో పారిపోయింది. ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన ఆ వ్యక్తితో భర్తకు తెలియకుండా ఇన్నాళ్లు చాటుమాటుగా వ్యవహారం నడిపింది. అతడు నివాసముండే నల్లొండకు చేరుకుని అక్కడ్నుంచి బైక్ పై వెళ్లిపోయింది. తల్లి కనిపించక పోవడంతో బాలుడు గుక్కపట్టి ఏడుస్తుంటే బస్టాండ్ లో ఆర్టీసీ సిబ్బంది.. పోలీసులకు సమాచారమిచ్చారు. నల్గొండకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్ కు చెందిన మహిళ పరిచయమైంది. ఆ యువకుడి కోసం ఆమె బిడ్డతో సహా హైదరాబాద్‌ నుంచి నల్గొండ చేరుకుంది. సీసీ కెమెరాల్లో ఇది రికార్డయ్యింది. పోలీసులు పారిపోయిన తల్లిని అన్వేషించారు. అనంతరం ప్రియుడితో ఉన్నఆ మహిళను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మహిళ ఇచ్చిన సమాచారంతో ఆమె భర్తను అక్కడికి పిలిపించి బాలుడిని అతడికి అప్పగించారు.


Read More
Next Story