హైదరాబాద్ శివారు బాలాపూర్ లో చిరుతల కలకలం
x

హైదరాబాద్ శివారు బాలాపూర్ లో చిరుతల కలకలం

ఆర్సీఐలో రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్


హైదరాబాద్ శివారు బాలాపూర్ లో రెండు చిరుతలు సంచరించడం స్థానికంగా కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో ఆర్సిఐ(రీసెర్చి సెంటర్ ఇమారత్ )లో రెండు చిరుతలు ఉన్నట్టు వాచ్ మెన్ గుర్తించి ఆటవీ శాఖాధికారులకు సమాచారమిచ్చాడు. వెంటనే అధికారులు పులుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఓ స్టీట్ డాగ్ ను రెండు పులులు వేటాడి తినేసాయి. ఈ ఘటన తర్వాత స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరూ కూడా ఆటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వలేదు. రెండు చిరుతలు ఇమారత్ లో తిరగటాన్ని వాచ్ మెన్ గమనించి ఉన్నతాధికారులకు చెప్పాడు. ఉన్నతాధికారుల సూచనమేరకు వాచ్ మెన్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు విషయాన్ని చేరవేశాడు.

రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా బద్వేలు చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో ఆటవీ అధికారులు ఇమారత్ లో బోన్లు అమర్చారు. ఇమారత్ లో ట్రాప్ కెమెరాలను అమర్చి చిరుతలను బంధించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆటవీ శాఖ అధికారిలు చిరుత కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ఒక శునకం మృత దేహం కనిపించింది. చిరుతల దాడిలో శునకం చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు చిరుతల పాదముద్రలు దొరికాయి.

Read More
Next Story