దసరా ధమాకా.. ఆకాశమే హద్దుగా మద్యం అమ్మకాలు
x

దసరా ధమాకా.. ఆకాశమే హద్దుగా మద్యం అమ్మకాలు

తెలంగాణ రాష్ట్రంలో దసరా ధూంధాంగా జరుగుతోంది. ఇది ఎవరో చెప్తున్నది కాదు.. మద్యం అమ్మకాల గణాంకాలు చెప్తున్న మాట.


తెలంగాణ రాష్ట్రంలో దసరా ధూంధాంగా జరుగుతోంది. ఇది ఎవరో చెప్తున్నది కాదు.. మద్యం అమ్మకాల గణాంకాలు చెప్తున్న మాట. ఐదు రోజుల్లో మద్యం అమ్మకాలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయని దుకాణాదారులు కూడా చెప్తున్నారు. ఎప్పుడూ జరిగే అమ్మకాలకన్నా ఈ ఐదు రోజుల్లో 25శాతం అమ్మకాలు పెరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఐదు రోజుల అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 15శాతం పెరుగుదల నమోదయింది. ప్రతి రోజూ అమ్మకాలు చూసుకున్నా అవి రూ.124కోట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ నెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌ఫాపులకు చేరిందని అధికారులు చెప్తున్నారు. అదే రోజున 2.35 లకక్షల కేసుల బీర్లు వైన్ షాపులకు చేరాయి.

తగ్గేదేలా అంటున్న బీర్లు

కేవలం మద్యమే కాకంండా బీర్ల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగినట్లు అధికారులుచెప్తున్నారు. ఈ నెల 10వ తేదీ ఒక్క రోజే 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు సమాచారం. ఇది ఏడాది కాలంలోనే రికార్డు స్థాయి అమ్మకాలని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కరోజుకు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుంది. లక్ష కేసుల వరకు బీర్లు అమ్ముడవుతాయి కానీ దసరా ధమాకాగా వీటి అమ్మకాలు ఆశాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ రెండు రోజులు ఈ అమ్మకాలు మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఐదు రోజుల సగటు ఇలా..

ఈ ఐదు రోజుల సగటు మద్యం అమ్మకాలు చూసుకుంటే.. ఈ ఐదు రోజుల్లో 2లక్షల కేసుల బీర్లు, 1.20 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడయింది. ఈ నెల 1వ తేదీ నుంచి చూసుకుంటే రాష్ట్రంలో రూ.852.38 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో14.53 లక్షల కేసుల బీర్లు, 8.37 లక్షల కేసుల లిక్కర్ ఉందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు మందుబాబులు మహా ఎంజాయ్ చేశారని అర్థమవుతోంది.

Read More
Next Story