అప్పట్లో రేవంత్ పరిస్ధితి ఏమిటో తెలుసా ? (వీడియో)
బండ్లలను ఓడలుగాను ఓడలను బండ్లుగాను మార్చేసే శక్తి ఒక్క కాలానికి తప్ప మరోదానికి లేదు.
కాలానికి మించిన శక్తి మరొకటిలేదు. బండ్లను ఓడలుగాను ఓడలను బండ్లుగాను మార్చేసే శక్తి ఒక్క కాలానికి తప్ప మరోదానికి లేదు. ఇపుడిదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమిటో జనాలందరికీ తెలుసు. కాని కొన్ని సంవత్సరాల క్రితం ? కొన్ని సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రముఖ నేత తన్నీరు హరీష్ రావు వెనకాల నిలబడుండే వారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నపుడు కెమెరాల్లో పడేందుకు రేవంత్ వెనుక నుండి తెగ ప్రయత్నించేవారు. ఇదంతా ఎలాగ తెలుసని అనుకుంటున్నారా ? పైన వీడియోలో స్పష్టంగా కనబడుతోంది కాబట్టే.
ఒకపుడు అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొత్తుపెట్టుకునే ప్రభుత్వాన్ని నడిపాయి. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ తరపున మంత్రులుగా పనిచేసిన వారిలో హరీష్ కూడా ఒకళ్ళు. అయితే కాంగ్రెస్ తో పడక కొంతకాలం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నుండే కాకుండా పొత్తులో కూడా విడిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ మంత్రులందరితో పాటు హరీష్ కూడా రాజీనామా చేశారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్బంగా @BRSHarish అన్న మాట్లాడుతుండగా వెనక నుండి నక్కి నక్కి చూస్తున్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం🤔🙆
— Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) August 1, 2024
చెప్పుకున్న వారికి ఒక బ్యాగ్ ఫ్రీ ఫ్రీ 🤣😂 pic.twitter.com/cAu0Q06AvH
జూలై 5, 2004లో మంత్రిగా హరీష్ రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అప్పుడు హరీష్ కు రేవంత్ మద్దతుదారుడిగా ఉండేవారు. అప్పట్లో హరీష్ మీడియాతో మాట్లాడుతుంటే వెనుకనుండి రేవంత్ కెమెరాల్లో పడేందుకు తొంగితొంగి చూస్తున్నారు. ఇదంతా మరో కెమెరాల్లో చిక్కటమే కాకుండా ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అప్పట్లో మంత్రకి రాజీనామా చేసిన హరీష్ మొన్నటివరకు మంత్రిగానే పనిచేశారు. కాని అప్పట్లో హరీష్ వెనకున్న రేవంత్ మాత్రం చకచకా పార్టీలు మారి ఎంఎల్సీ, ఎంఎల్ఏ, ఎంపీ అయిపోయి ఇపుడు ఏకంగా ముఖ్యమంత్రే అయిపోయారు. అదే కాలానికి ఉన్న పవర్. అందుకనే కాలానికి మించిన పవర్ ఇంకేదీ లేదనేది.