Love Jihad | లవ్ జిహాదీలు క్రైస్తవులను కూడా టార్గెట్ చేస్తున్నారు
x
బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ (ఎక్స్ ఫోటొ)

Love Jihad | లవ్ జిహాదీలు క్రైస్తవులను కూడా టార్గెట్ చేస్తున్నారు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ క్రైస్తవులకు సలహా


హిందూ, క్రైస్తవ మతాలను ప్రభావితం చేస్తున్న లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి హిందువులతో క్రైస్తవులు చేతులు కలపాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు.“లవ్ జిహాదీలు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేయరు.గోవాలోని మన క్రైస్తవ సోదరులకు నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.చిత్రం మొత్తం కథను చెప్పనప్పటికీ మీరు కేరళ ఫైల్స్ చిత్రాన్ని చూడండి’’అని బీజేపీ ఎమ్మెల్యే కోరారు.

దక్షిణ గోవాలోని కర్చోరెమ్‌లో జరిగిన భజరంగ్ దళ్ ర్యాలీని ఉద్ధేశించి రాజాసింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జిహాదీల జనాభా పెరిగి, వారి శాసనసభ్యుల సంఖ్య పెరిగితే వచ్చే 20 నుంచి 30 సంవత్సరాల్లో భారతదేశానికి హిందూ మత ప్రధానమంత్రి ఉండరు’’అని ఆయన పేర్కొన్నారు.

గోవాలో పెరిగిన ముస్లిం జనాభా
గోవాలో హిందువుల జనాభా తగ్గుముఖం పట్టిందని రాజాసింగ్ చెప్పారు. ఎక్కడ హిందువుల జనాభా తగ్గిందో అక్కడ హిందువుల మతమార్పిడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.గోవాలో 10-15 ఏళ్ల క్రితం 3 శాతం ఉన్న ముస్లింల సంఖ్య ఇప్పుడు 12 శాతానికి పెరిగిందని సాక్షాత్తూ గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై ఇటీవల చెప్పారని రాజాసింగ్ గుర్తు చేశారు.

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం
ముస్లిం పురుషులు ఇతర మతాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకొని వారి విశ్వాసాన్ని మార్చమని బలవంతం చేయడానికి లవ్ జిహాద్ పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.“లవ్ జిహాద్ పేరుతో హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ఎలా ప్రలోభపెట్టారో సినిమాలో చూపించాం. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు క్రైస్తవ సోదరుల కోసం హిందువులు మా తలుపులు తెరిచి ఉంచాం. చేయి చేయి కలపండి...మా బలం పెరుగుతుంది” అని ఆయన అన్నారు.

జిహాదీల జనాభా పెరిగితే...
భారతదేశంలో జనాభా ధోరణిని బట్టి వచ్చే 10 నుంచి 20 ఏళ్లలో రామ నవమి, హనుమాన్ జయంతి మొదలైన పండుగలకు హిందువులు ఊరేగింపులు నిర్వహించలేరని సింగ్ అన్నారు."జిహాదీల జనాభా పెరిగితే వారి ఎమ్మెల్యేలు,ఎంపీల సంఖ్య పెరిగితే, రాబోయే 20-25 సంవత్సరాలలో భారత ప్రధాని హిందువు కాదు, ముస్లిం అవుతాడని బీజేపీ నాయకుడు అన్నారు.కుటుంబ నియంత్రణ కొనసాగితే వచ్చే 25 నుంచి 30 ఏళ్లలో హిందువుల పరిస్థితి పాకిస్థాన్‌లోని హిందువుల్లా మారుతుందని అన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలపై కేసులు
హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గతంలో మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు ఎదుర్కొన్నారు.బంగ్లాదేశ్ లోని హిందువులను చంపేస్తున్నారని, వారి దుకాణాలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణ కోసం పోరాడేందుకు ‘భజరంగీ’ సిద్ధంగా ఉందని అన్నారు. వేదికపై బంగ్లాదేశ్ జెండాను చించివేశారు.

మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించవద్దు : కాంగ్రెస్
రాజా సింగ్ గోవా రాష్ట్ర పర్యటనను రద్దు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ గతంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు విజ్ఞప్తి చేసింది. ద్వేషపూరిత ప్రసంగాల వల్ల మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తే అవకాశముందని, దీనివల్ల శాంతియుత గమ్యస్థానంగా గోవా ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ పేర్కొంది.“గోవా మత సామరస్యం శాంతియుత సహజీవనానికి ప్రసిద్ధి చెందింది. ద్వేషపూరిత ప్రసంగం,మత హింసను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్న టి రాజా సింగ్ వంటి వారిని ఆహ్వానించడం ద్వారా బీజేపీ సర్కార్ ఈ ప్రతిష్ఠాత్మక గోవా వారసత్వాన్ని ప్రమాదంలో పడేస్తోంది’’అని కాంగ్రెస్ గోవా యూనిట్ మాజీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ చెప్పారు.



Read More
Next Story