బీసీ రిజర్వేషన్లపై మళ్ళీ కోర్టులో పిటిషన్..
x

బీసీ రిజర్వేషన్లపై మళ్ళీ కోర్టులో పిటిషన్..

42శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఛాలెంజ్ చేసిన మాధవరెడ్డి.


బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై మాధవరెడ్డి అనే వ్యక్తి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ అంశంపై ఒకసారి ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. పేపర్లలో వార్తల ఆధారంగా విచారణ జరపలేమని న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది. అయితే ఇప్పుడు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీఓ నెం.9ను విడుదల చేసింది. దీంతో ఈ జీఓను ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హౌజ్ మోషన్ పిటిషన్‌కు అనుమతి కోరారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ హైకోర్ట్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

అయితే జీఓ తీసుకొస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ కమిషన్, బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం బీసీలకు ఎంతో ఊతమందిస్తుందని వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సన్నద్ధం కావడంలో వేగాన్ని పెంచారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఏ క్షణానైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మరోసారి వాయిదా పడతాయా? అన్న చర్చలు మొదలయ్యాయి.

Read More
Next Story