రీపోలింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా -మాధవీ లత
x

రీపోలింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా -మాధవీ లత

రీపోలింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని మాధవీ లత అన్నారు. హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఏఐఎంఐఎం నేతలు రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.


రీపోలింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాధవీ లత అన్నారు. హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఏఐఎంఐఎం నేతలు రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిగ్గింగ్ చేసి గెలిచినా గెలుపు కూడా ఓ గెలుపేనా అని ఎద్దేవా చేశారు.

రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన నాపై వేలాదిగా రౌడీ మూకలు దాడి చేసేందుకు ప్రయత్నించారు, రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారని, స్పందించలేదని మాధవీ లత మండిపడ్డారు. 16 ఏళ్ళ ముస్లిం బాలిక రెండు సార్లు ఓటేయడానికి వచ్చి దొరికిందని అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సాక్ష్యాలతో దొరికినా కేసు నమోదు చేయకుండా తల్లిదండ్రులకు అప్పగించి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది అసలు భారతదేశమేనా? ఇక్కడ 144 సెక్షన్ ఉండదా అని ప్రశ్నించారు మాధవీ లత. రిగ్గింగ్ పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని, అవసరమైతే రీపోలింగ్ పెట్టడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు గురువారం ముంబయిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు వెల్లడించారు.

కాగా, పోలింగ్ రోజు రిగ్గింగ్ మాధవి లత హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని వివిధ పోలింగ్ బూతుల్లో పర్యటించారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చారనే అనుమానంతో ఓ మహిళ బుర్ఖా తీసి పరిశీలించడంపై వివాదం తలెత్తింది. ఆమె చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ... మాధవీ లతపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఆమెపై మలక్ పేట పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Read More
Next Story