తెలంగాణాలో మొదటి ఫలితం ఏ నియోజకవర్గమో తెలుసా ?
x

తెలంగాణాలో మొదటి ఫలితం ఏ నియోజకవర్గమో తెలుసా ?

కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైనా మొదటి అధికారిక ఫలితం మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో ప్రకటించే అవకాశముంది.


తెలంగాణాలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లోను ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 17 నియోజకవర్గాలకు గాను మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ ఏర్పాటుచేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 10 వేల మంది సిబ్బందిని కమీషన్ ఉపయోగిస్తోంది. మరో 5 వేలమందిని రిజర్వులో ఉంచుకుంది. 34 కేంద్రాల్లో కౌంటింగ్ 49 మంది అబ్జర్వర్లు పరిశీలనలో జరగబోతోంది. కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైనా మొదటి అధికారిక ఫలితం మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో ప్రకటించే అవకాశముంది. మొత్తం 17 నియోజకవర్గాలకు గాను మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఫలితం మొదటగా ప్రకటించే అవకాశముంది.

ఎందుకంటే మిగిలిన 16 నియోజకవర్గాల కౌంటింగ్ లో సగటున 20 రౌండ్లు ఉంటే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మాత్రం 13 రౌండ్లే. కాబట్టి మిగిలిన అన్నీ నియోజకవర్గాలకన్నా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఫలితం అధికారికంగా ముందు ప్రకటించే అవకాశముంది. కౌంటింగ్ సజావుగా సాగటానికి వీలుగా 2440 మంది మైక్రో అజ్జర్వర్లను కమీషన్ నియమించింది. వీరంతా కౌంటింగ్ జరిగే ప్రతి టేబుల్ దగ్గర ఉంటారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అత్యధికంగా యాకుత్ పురా, చొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. ఎందుకంటే పై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 24 రౌండ్లు జరపాల్సుంటుంది. అలాగే అతి తక్కువగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తవుతుంది.

కౌంటింగ్, ఫలితాల ప్రకటన సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఎన్నికల కమీషన్ ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గరా కేంద్ర బలగాలను మోహరించింది. ప్రతి కౌంటింగ్ హాలులోపలా కమీషన్ సీసీటీవీ ఏర్పాట్లుచేసింది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని ఎన్నికల కమీషన్ రికార్డు చేయిస్తొంది. ఇదే సందర్భంలో పార్టీల తరపున కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. నేతలు, కార్యకర్తలు అక్కడే ఉంటారు కాబట్టి ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికల కమీషన్ అన్నీ జాగ్రత్తలు తీసుకున్నది.

Read More
Next Story