Mahesh Kumar Goud
x

‘ప్రతిపక్షాలను ఎదుర్కొనే నాయకులకే పదవులు’

పూర్తికావొస్తున్న డీసీసీ అధ్యక్షుల పదవుల నియామకాలు.


డీసీసీ అధ్యక్షుల నియామకాలను అక్టోబర్ ఆఖరులోగా పూర్తి చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగానే డీసీసీ పదవులు ఎవరికి పడితే వాళ్లకి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకులకే పదవులు అందిస్తామన్నారు. జిల్లాల్లో సమర్థవంతమైన నాయకత్వం రూపొందించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. ఆ మేరకు డీసీసీ అధ్యక్ష పదవుల నియామకాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని తాము ఖర్గేకు కూడా వివరించామన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఖర్గేను మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు.

‘‘కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిశాను. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహిత నిర్ణయాలను వివరించా. అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తవుతుంది. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారు. సంస్థాగత పునర్నిర్మాణం పగద్బందీగా, ఏ గ్రూపు ఒత్తిడికి లొంగకుండా పనిచేయాలన్నారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను పరిశీలకులు సమర్పిస్తారు. అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది’’ అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు.

Read More
Next Story