Mahesh Kumar Goud
x

పార్టీలో నేతల అలక వాస్తవం.. ఒప్పుకున్న మహేష్ కుమార్

కుల గణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


కుల గణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అభివృద్ది , సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతతో కాంగ్రెస్ పాలన సాగుతోందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో తొలిసారిగా కులగణన సర్వేను సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ కార్యకర్తల కృషితో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు పడిన కష్టం చాలా కీలకమని అన్నారు.

‘‘సీఎం రేవంత్ ,మంత్రుల బృందం చిత్త శుద్ధితో పాలనను సాగిస్తోంది. రాహుల్ గాంధీ ఆలోచన,ఆశయం మేరకు కులగణ సర్వే నిర్వహించాం. 40 ఏళ్ల కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. పీసీసీ కార్యవర్గంతో పాటు ఇతర పదవులను భర్తీ. కోసం కసరత్తు జరుగుతుంది. కులగణన సర్వేను శాస్ర్తీయ బద్దంగా ప్రభుత్వం నిర్వహించింది. కుల సర్వే పై ప్రతిపక్షాలు పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు తండ్రి మీద కొడుకు వలె అలక బూనిన మాట వాస్తవం..వారందరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. కుల సర్వే, ఎస్సీ వర్గీకరణనను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మీద ఉంది’’ అని తెలిపారు మహేష్ కుమార్. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో ప్రమాణ స్వీకారం చేసిన యూత్ కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగానే రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ కూడా మాట్లాడుతూ.. పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

యూత్ కాంగ్రెస్ అనేది ఒక ఎమోషన్: అనిల్

‘‘యువజన కాంగ్రెస్ అంటే ఎమోషన్. యువజన కాంగ్రెస్ నుండే నేను రాజ్యసభ సభ్యుడిని అయ్యాను. మీరు చేసే సేవలతోనే మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసే ప్రతి పనీ కాంగ్రెస్ పార్టీలో రిజిస్టర్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి యువతను ప్రోత్సహిస్తున్నాడు. అందుకే యువజన కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. అధికార పార్టీలో బాధ్యతలు తీసుకుకుంటున్నారు. మీ పై పెద్ద బాధ్యత ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తిరిగి ప్రచారం చేయాలి. మీ సలహాలు కావాలంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా’’ అని తెలిపారు.

Read More
Next Story