బిజేపిలో మల్కాజ్ గిరి కుంపటి..
x
Source: Twitter

బిజేపిలో మల్కాజ్ గిరి కుంపటి..

టికెట్ కోసం ఆ పార్టీలోని ఉద్ధండులే పోటీ పడుతుండటంతో బీజేపీ నాయకత్వానికి మల్కాజ్‌గిరి సవాల్‌గా మారింది.


జీఆర్ సంపత్ కుమార్


తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ హాట్ సీట్ గా మారింది. ఈ ఒక్క స్థానం టికప్పులో తుఫాన్ లాగా, టిబిజేపిలో వర్గపోరు బహిర్గతమవుతున్నది. తెలంగాణ బిజేపిలో కీరోల్ పోషిస్తున్న ముగ్గురు ప్రధాన నాయకులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురికి ముగ్గురు ఆశావాహులను ఎంపిక చేసుకొని అప్పుడే హామీ ఇవ్వడంతో, ఆముగ్గురు నాయకులు ప్రఛారాన్ని ప్రారంబించుకోవడంతో ఆ పార్లమెంట్ నియోజక వర్గ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ఇక్కడ ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆపార్టీలో తీవ్రగందరగోళం నెలకొంది. రాష్ట్ర నాయకత్వానికే కాకుండా అదిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది. తెలంగాణలోని 17 నియోజకవర్గాలలో బిజేపి అత్యదిక ఆశావాహులు మల్కాజ్ గిరిలోనే వున్నారు. టికెట్ కోసం ఆపార్టీలోని ఉద్దండులే పోటీ పడుతుండటంతో పార్టీకి సవాల్ గా మారింది.

ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేశ్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ తోపాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కొమరయ్య, బీజేపీ సీనియర్ నేత ఎస్ మల్లారెడ్డి,మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, కొంపల్లి మోహన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఈ టికెట్ ను ఆశిస్తున్నారు.
కాగా టికెట్ తనకే వస్తుందని ఎవరిధీమాలో వారున్నారు. కానీ ఇప్పటికే మురళీధర్ రావు, మల్క కొమురయ్య, ఈటెల రాజేందర్, చాడా సురేష్ రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. మురలీధర్ రావు ఏకంగా ప్రచార రధాన్ని చేయించి ప్రచార పర్వంలో ముందువరుసలో వున్నారు. మల్కాజ్ గిరి టికెట్ ఇప్పించుకొని పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న ముగ్గురు నాయకులపై కూడా ఇటీవలి కాలంలో అధిష్టానం సీరియస్ ఆయినట్లుగా ఆపార్టీ నాయకులు బహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. మల్క కొమురయ్య కోసం రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మన్, ఈటెల రాజేందర్ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు కోసం బండి సంజయ్ ప్రయత్నిస్తుండండతో, మిగతా ఆశావాహులు మాత్రం పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు.
ప్రధానంగా ఈటెల రాజేందర్ కు టికెట్ రాని పక్షంలో మనసు మార్చుకొని ఇతర పార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని ప్రచారం కొనసాగుతున్నది. పార్టీ మరే ఆలోచనలో కుత్బుల్లాపూర్ మాడీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముందు వరసలో వున్నారు. ఇప్పటి అధిష్టానం వద్ద తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనకు మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని బహిరంగంగనే ప్రకటించారు. ఇదే తరహాలో ప్రస్తుతమున్న ఆసావాహులలో మరికొందరు కూన శ్రీశైలం గౌడ్ బాటలో నడిచే అవాకాశాలు ఉన్నాయి. దీంతో మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ బిజేపి కొంపలో కుంపటిలా మారిందని చెప్పవచ్చు.


Read More
Next Story