అమెరికాలో సందడి చేసిన మల్లారెడ్డి
x

అమెరికాలో సందడి చేసిన మల్లారెడ్డి

అమెరికాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. అమెరికాలో జరుగుతున్న 2024 అంతర్జాతీయ విద్యా సదస్సులో ఆయన పాల్గొన్నారు.


అమెరికాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. అమెరికాలో జరుగుతున్న 2024 అంతర్జాతీయ విద్యా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యుత్తమ ప్రమాణాలతో మా యూనివర్సిటీ విద్యను అందిస్తోందని పేర్కొన్నారు. అమెరికా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సెమినార్‌లో భారతదేశం తరఫున టాప్ 20 యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫున హాజరవ్వడం గర్వంగా ఉందన్నారు.

అమెరికా, జపాన్, చైనా, పోర్చుగల్ లాంటి దేశాలు ఈ సెమినార్‌లో పాల్గొన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచంలోని పెద్ద యూనివర్సిటీలు అన్ని ఈ సెమినార్‌లో స్టాళ్లు పెట్టుకున్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి తమ మూనివర్సిటీ స్టాళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా యూనివర్సిటీలతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం లభించిందని తెలిపారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రపంచంలోని కొత్త కోర్సుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని, వాటిని తమ యూనివర్సిటీకి తీసుకు రావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హెల్త్, అగ్రికల్చర్ కోర్సులను తమ యూనివర్సిటీలో కూడా పెడతామన్నారు. నిపుణులైన విద్యార్థులను తయారు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. పోటీ ప్రపంచానికి ధీటుగా మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సెమినార్‌ కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని మల్లారెడ్డి అన్నారు.

Read More
Next Story