SLBC టనెల్ కూలిపోయేందుకు ఈ జలపాతమే కారణమా?
x
మల్లెల తీర్థం జలపాతం

SLBC టనెల్ కూలిపోయేందుకు ఈ జలపాతమే కారణమా?

టనెల్ తవ్వకం క్రమంగా నల్లమల అడవుల్లోని మల్లెల తీర్థం జలపాతం సమీపానికి చేరుకుంది. టనెల్ లో దూకుతున్న తీరు ఈ జలపాతం వూటేనని చెబుతున్నారు.



ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లెల తీర్థం జలపాతం నీరే భూగర్భంలోనుంచి పారుతూ వచ్చి ఎడడ గట్టు కాలువలోకి బురద జలపాతం లాగా దూకుతూ వచ్చిందా? తొలిసారి ఎడమ గట్టు కాలువ టనెల్ కూలిపోవడానికి మల్లెల జలపాతం కారణమయి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతూ ఉంది.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌ ప్రమాదం ఎలా జరిగిందనేది ఒక ఆసక్తికరమయిన వివరణ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ టెనల్ పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగింది. దీనితో పైనుంచి పడిన మట్టి, రాళ్ల మధ్య ఎనిమిది మంది పనివారు సజీవ సమాధి అయ్యారు. ఇందులో నిన్నటికి ఇద్దరి మృతదేహాలు మాత్రం దొరికాయి. భారతదేశ చరిత్ర లో ఇంత జటిలమయిన రెస్క్యూ ఆపరేషన్ లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

భూగర్భంలో అయిదు వందల అడుగుల లోతున తవ్వుతున్న ఈ టనెల్లోకి విపరీతంగా ఊటనీరు వస్తూండటంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనడం కష్టమయింది. ఈ వూటనీటిని ఆపడం సాధ్యంకాలేదు. ఈ వూటనీటి వల్ల టనెల్ లోపల బురదమయం అయింది,అంతేకాదు, పైనున్న అడవి మట్టి ఈ వూటనీటిద్వారా కొట్టుకూస్తూ ఉంది. దీనితో ప్రమాదం జరిగిన చోటికి పోతే, అక్కడ పైకప్పు ఇంకా కూలిపోయి, కాపాడేందుకు వెళ్లిన వారు కూడా చిక్కుకుపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దీనితో అసలేం జరుగుతున్నదో, అంత వూటనీరు ఎక్కడి నుంచి వస్తున్నదో ఇంతవరకు తెలియలేదు. ఇపుడు ఈ వూటనీరు సోర్స్ ని అధికారులు కనిపెట్టినట్లు తెలిసింది.

ఊటనీరు తొలినుంచి ఎస్ ఎల్ బిసి లోకి ఎప్పటి నుంచో వస్తూ ఉంది. అదెక్కడి నుంచి వస్తున్నదో, ఎంతో మోతాదో కనుక్కుని ఆ నాటిని బయటకు పంపకుండా, గ్రౌటింగ్‌ ద్వారా అడ్డుకున్నారు ఇంజనీర్లు. ఇపుడు ఆ నీరు అంతా ఒక్కచోటకు చేరి టన్నెల్‌ పైకప్పు మీద వత్తిడి పెరిగి కూలేందుకు కారణమయిఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

వాస్తవానికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు మొదటి నుంచీ ఏదో ఒక రూపంలో ఆటంకం ఎదురవుతూనే ఉంది. దాంతో 2005లో మొదలైన ఈ సొరంగ మార్గం పనులు నేటికీ పూర్తికాలేదు.

2019 నుంచి ముందుకు సాగని పనులు..

2019 నుంచి టన్నెల్‌లోకి ఊటనీరు వచ్చిచేరడమే కాకుండా మట్టి, రాళ్లు కూలుతుండటంతో సొరంగం తవ్వకం పనులు ముందుకు సాగలేదు. ఇదెక్కడి నుంచి వస్తున్నదో వూహించకుండా తాత్కాలిక పరిష్కారంతో పనికానిచ్చేశారు. ఊటనీటిని తోడేస్తూ, మట్టిని తొలగించడంతో పాటు ఊటనీరు టనెల్ లోకి కారకుండా, మట్టి, రాళ్లు పడకుండా సిమెంట్‌, పాలియూరిథిన్‌ గ్రౌటింగ్‌ చేయించారు.

అయితే ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదానికి ఇదే కారణమయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపేజీ (ఊటనీరు)ని గ్రౌటింగ్‌ చేయడంతో.. ఆ నీరు టన్నెల్‌ పై భాగంలో ఒకే ప్రాంతంలో చేరి, ఒత్తిడితో టన్నెల్‌లోకి వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.



వాస్తవానికి దోమలపెంటలోని టన్నెల్‌ నుంచి 20 కిలోమీటర్ల లోపే మల్లెల తీర్థం జలపాతం ఉంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనువిందుచేసే జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతూ ఉంటుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో అమ్రాబాద్ మండలంలోని వట్వర్లపల్లి గ్రామం నుండి 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం జలపాతానికి చేరుకోవచ్చు. ఇక్కడ ఏడాదిలో 365 రోజులూ జలపాతంలో నీళ్లుంటాయి. ఆ నీళ్లన్నీ క్రమంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో కలుస్తాయి. అయితే దోమలపెంట నుంచి లోపలికి 13.95 కిలోమీటర్ల దాకా టన్నెల్‌ తవ్విన సంగతి తెలిసింది. ఈ ప్రాంతానికి కేవలం 4.7 కిలోమీటర్ల దూరంలోనే మల్లెల తీర్థం జలపాతం ఉంది.అందుకే అక్కడి నుంచి నీరు వూటరూపంలో టనెల్ లోకి పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉందని అనుమానం. నిమిషానికి 3వేల లీటర్ల ఊటనీరు రావడం వెనుక కారణం ఇదేనని నిపుణులు గుర్తించారు. ఇప్పటిదాకా శ్రీశైలం జలాశయంలోని నీరే సీపేజీగా మారుతుందని అనుమానిస్తూ వచ్చారు. అయితే, ఆ నీరు మల్లెల తీర్థం జలపాతం నుంచి వస్తోందని నిర్ధారించారని ఆంధ్ర జ్యోతి ఒక కథనం ప్రచురించింది.

చెక్ డ్యామ్ నిర్మాణం పరిష్కారం
మల్లెల తీర్థం దిగువన ఒక చెక్‌డ్యామ్‌ లేదా హెడ్‌ను అభివృద్ధి చేసి, ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా వటువర్లపల్లి పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరుగా అందించడం వల్ల భూమిలోకి ఈ నీరు ఇంకి పోకుండా చేయవచ్చు. మరో ప్రత్యామ్నాయం టన్నెల్‌లోకి సీపేజీ దిగుతున్న ప్రదేశం నుంచే నీటిని దారిమళ్లించడం అని అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో దోమలపెంట వైపునుంచి లోపలికి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లడం ఏమాత్రం సురక్షితం కాదని, ఏదైనా జరిగే అవకాశం ఉందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎ్‌సఐ) ఇప్పటికే హెచ్చరించింది. సరి గ్గా టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ 13.6 కిలోమీటర్ల వద్ద ఉన్నప్పుడే సొరంగం పైకప్పు కూలింది.


Read More
Next Story