ఇక్రిశాట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
x

ఇక్రిశాట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

నిందితుడు బీదర్ వాసి


తెలంగాణలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఇక్రిశాట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని రామచంద్రపురం పోలీసులు అరెస్ట్ చేశాడు. కర్ణాటక బీదర్ కు చెందిన ఖురేషి షబ్బీర్ అలీ ఒరిస్సా నుండి గంజాయిని తీసుకొచ్చి అమ్మినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

గంజాయిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. నార్కో అనాలిసిన్ టీం ఈగల్ టీంగా పేరు మారింది. తెలంగాణలో ఉన్న వేలాది ఎకరాల సాగు భూమిలో ఒక్క గంజాయి మొక్క ఉన్నా ఈగల్ టీం పసిగట్టగలదు. రాష్ట్రంలో ఎవరు గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా గుర్తించే సామర్ధ్యం ఈగల్ టీం కు ఉంది. అందులో భాగంగా ఇక్రిశాట్ వద్ద గంజాయిని అమ్ముతున్న వ్యక్తిని ఈగల్ టీం పట్టుకోగలిగింది


Read More
Next Story