TG లో ఓ వ్యక్తికి 1970 నుంచి 2024 వరకు కరెంట్ బిల్లు రూ.21 కోట్ల
ఓ మధ్యతరగతి వ్యక్తికి పవర్ బిల్ వేలు కాదు, లక్షలు కాదు, రూ. కోట్లలో కరెంటు బిల్ వచ్చింది. ఇది చూసి అతనికి కరెంటు షాక్ కొట్టినంత పని అయింది.
శీతాకాలం, వానాకాలం తో పోలిస్తే వేసవికాలం అందరి ఇళ్లలోనూ కరెంటు వినియోగం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే వేసవిలో కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి ఆ రెండు సీజన్స్ తో కంపేర్ చేస్తే వేసవిలో పవర్ బిల్ డబుల్, ట్రిపుల్ కూడా అవుతుండొచ్చు. ఇది సహజమే. అందులోనూ మధ్య తరగతి ఇళ్లలో కరెంటు ఎంత ఎక్కువ వాడినా బిల్లు మహా అయితే రూ.1000 నుంచి రూ.2000 మధ్యలో ఉండొచ్చు. కానీ ఓ గ్రామానికి చెందిన మామూలు మధ్యతరగతి వ్యక్తికి పవర్ బిల్ వేలు కాదు, లక్షలు కాదు, రూ. కోట్లలో కరెంటు బిల్ వచ్చింది. ఇది చూసి అతనికి కరెంటు షాక్ కొట్టినంత పని అయింది.
వివరాల్లోకి వెళితే...
తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే వ్యక్తి ఇంటి కరెంటు బిల్లు రూ.21 కోట్లు వచ్చింది. అతని ఇంటి సర్వీస్ నెంబర్ 1110000 51 మీటర్ కేవలం 0.60 కిలో వాట్స్ కి సంబంధించినది. జనవరి 1, 1970 నుంచి జూన్ 5, 2024 వరకు 998 రోజులపాటు 297 యూనిట్ల కరెంటు వాడినందుకు రూ.21,47,48,569 బిల్ వచ్చింది. ఈ బిల్ అతనికి జూన్ ఐదున ఇవ్వడం మరో విశేషం. అయితే కరెంటు బిల్లు దాదాపు రూ.21 కోట్లు రావడంతో ఇంటి యజమాని వేమారెడ్డి ఖంగు తిన్నాడు. అయితే ఇలా వేమారెడ్డికి ఒక్కడికే కాదు ఆ గ్రామంలో మరో పది మందికి రూ.కోట్లలోనే కరెంటు బిల్లు వచ్చిందట.
అవగాహన లేని బయటి వ్యక్తులతో లైన్ మెన్, జూనియర్ లైన్ మెన్ విద్యుత్తు బిల్లుల ఇస్తున్నారని, అందుకే ఇలాంటి పొంతన లేని బిల్లులు వస్తున్నాయని వారంతా మండిపడుతున్నారు. ఇక ఎక్కువ బిల్లు వచ్చిన వారంతా స్థానిక విద్యుత్ అధికారిని సంప్రదించగా టెక్నీకల్ సమస్యతో అధిక బిల్లు వచ్చినట్టు చెప్పారట. వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని బిల్లులను వెంటనే సవరించినట్లు ఏఈ మహేష్ తెలిపారు.