
మూడున్నర గంటలు సాగిన మంచు లక్ష్మీ విచారణ
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో నటిని విచారించిన ఈడీ.
బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన తారలను విచారిస్తోంది. ఈ అంశంలో మణీలాండరింగ్ కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే నటీనటులందరినీ ఒక్కొక్కరిగా ఈడీ విచారిస్తోంది. సదరు నటులు.. బెట్టింగ్ యాప్స్‌తో చేసుకున్న కాంట్రాక్ట్‌లు, చేసిన లావాదేవాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం.. నటి మంచు లక్ష్మిణి ఈడీ విచారించింది. ఆమె విచారణ దాదాపు మూడు గంటలపాటు కొనసాగింది. ఈ విచారణలో ఆమెను అనేక కోణాల్లో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ సందర్భంగానే తాను చేసిన లావాదేవాలు, కాంట్రాక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మంచు లక్ష్మీ.. ఈడీకి అందించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన మంచు లక్ష్మీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఈడీ కార్యాలయం నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈడీ విచారణకు హాజరైన రానా కూడా ఇదే విధంగా వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక మంది నటీనటును ఈడీ విచారించింది.