మణుగూర్ బిఆర్ఎస్ కార్యాలయం దగ్ధం
x
brs office set on fire

మణుగూర్ బిఆర్ఎస్ కార్యాలయం దగ్ధం

జిల్లా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్


బిఆర్ఎస్ భద్రాది కొత్తగూడెం జిల్లా మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటనపై ఆదివారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం రాజ్యమేలుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల కాలంలో బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. మణుగూరు పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సమాచారం తెలుసుకున్న కేటీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్ లో మాట్లాడారు. 60 లక్షల సభ్యులున్న బిఆర్ఎస్ కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.


త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని సందర్శించి, అదే ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మిద్దామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీలకు భయపడాల్సిన అవసరం లేదని, వారికి చరమగీతం పాడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు రౌడీల రాజ్యం కొనసాగుతుందన్నారు.

పెట్రోల్ పోసి తగలబెట్టారు


ఆదివారం ఉదయం మణుగూరు పార్టీ కార్యాలయం దగ్దమైంది. కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యాలయం, ఫర్నిచర్ ను పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అనంతరం తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగినట్టు ఆరోపించింది. బిఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయంను ఆక్రమించుకుని బిఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మణుగూరు పార్టీ కార్యాలయం దగ్దం అయిన ఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మణుగూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Read More
Next Story