
మోహన్ బాబు ఇంటి దగ్గర బైఠాయించిన మనోజ్
తనను లోపలికి అనుమతించాలంటూ నిరసన చేపట్టాడు. దీంతో అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవడం కోసం పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర మరోసారి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. జల్‌పల్లి ఫామ్ హౌస్ దగ్గరకు మనోజ్ చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మనోజ్ నిరసనకు దిగారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థానికి చేరకున్నారు. మంచు టౌన్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల తన నివాసంలో చోటు జరిగిందంటూ మనోజ్.. పోలీసులు ఆశ్రయించాడు. తన అన్న విష్ణు తాను లేని సమయంలో ఇంట్లో పలు వస్తువులను ధ్వంసం చేశాడని, కార్తలను దొంగలించే ప్రయత్నం చేశాడంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జల్‌పల్లి ఫామ్ హౌస్ దగ్గరకు చేరుకున్నాడు మనోజ్. అతడిని లోపలికి అనుమతించలేదు.. దీంతో మనోజ్ అక్కడే బైఠాయించాడు. తనను లోపలికి అనుమతించాలంటూ నిరసన చేపట్టాడు. దీంతో అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవడం కోసం పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే మంచు ఫ్యామిలీలో మంటలు గతేడాది నుంచి కొనసాగుతున్నాయి. పలు అంశాల్లో మనోజ్‌కు మిగిలిన కుటుంబ సభ్యులకు పొసగడం లేదని, ఆ క్రమంలోనే వారి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చి అవి కాస్తా కుటుంబ కలహాలుగా మారాయని అంటున్నారు. ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం, ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడి చేయడం ఇలా నానాహంగామా జరిగింది. ఆ గొడవ చల్లారిందని అంతా భావించారు. కానీ మంచు ఫ్యామిలీ గొడవలు నివురుగప్పిన నిప్పులా ఉంది తప్పితే చల్లారలేని ఈరోజు ఘటన స్పష్టం చేస్తోంది.