మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి దెబ్బ.. లొంగిపోయిన ఆశన్న
x

మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి దెబ్బ.. లొంగిపోయిన ఆశన్న

మావోయిస్ట్ కేంద్ర కమిటీ అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న లొంగుబాటు.


మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ లొంగుబాటు నుంచి తేరుకోకముందే మరో కీలక నేత పార్టీని వీడారు. ఆయుధాలను వదిలిపెడుతూ జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారు. ఆయన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న. ఆయన బుధవారం సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు 70 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు. కాగా గురువారం రోజున రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి ముందు ఆయుధాలను వదిలిపెట్టనున్నారు.

అసెలవరీ ఆశన్న..

మావోయిస్ట్ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న.. 1970లో ఖమ్మం జిల్లాలో జన్మించారు. 1990 చివరిలో ఆయన మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. పార్టీలో చాలా వేగంగానే తన మార్క్‌ చూపించుకుంటూ ఎదిగాడు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. పార్టీ రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాలు, ప్రచార విషయాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రెడ్ కారిడార్ ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆయన తలపై కేంద్రం రూ.10 లక్షల బహుమతి ప్రకటించింది.

Read More
Next Story