వరుస హత్యలతో మావోయిస్టుల ఘాతుకం
x

వరుస హత్యలతో మావోయిస్టుల ఘాతుకం

తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం


చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని బీజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ ఫార్మర్లు అనే కారణంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు చంపేశారు. చనిపోయిన వ్యక్తుల్లో ఒకరు మాజీ మావోయిస్టు. శనివారం అర్ధరాత్రి మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. యాంపురం, సండ్రం బోరు గ్రామాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడు రోజులక్రితం ఇన్ ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు తాజాగా మరో ఇద్దరిని హత్య చేయడం కలకలం రేపింది. కీంకారణ్య గ్రామాల్లో ఇన్ ఫార్మర్లు అనే కారణం చూపి హత్యలు చేయడం కలవరపాటుకు గురి చేసింది. లొంగిపోతున్న మావోయిస్టులు అటు పోలీసులు ఇటు మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నారు. వారి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది.

ఆపరేషన్ కగార్ పేరిట భధ్రతా బలగాలు చత్తీస్ ఘడ్ , తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టులను ఏరి వేస్తున్నాయి. ఇటీవలికాలంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున చనిపోయారు. ఎక్కువ సంఖ్యలో లొంగిపోయారు. బ్రతకడం కోసం జనజీవన స్రవంతిలో కల్సి పోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో తమ కాళ్లపై తాము నిలడబే ప్రయత్నం చేస్తున్నారు. భద్రతా బలగాలకు భయపడి మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కల్సిపోతున్నప్పటికీ మావోయిస్టుల నుంచి ముప్పు తొలగిపోవడం లేదు. లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే తమవాళ్లు ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారని మావోయిస్టుల అనుమానం. ఈ అనుమానమే పెనుభూతమై లొంగిపోయిన మావోయిస్టులపై ప్రతీకారచర్యలకు పాల్పడుతున్నారు.

చత్తీస్ ఘడ్ , తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో ఇటీవలి కాలంలో భారీగా మావోయిస్టులు చనిపోయారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో బీజూపూర్ జిల్లాలో ఇన్ ఫార్మర్లు అనే కారణంతో ఒకే రోజు నలుగురిని మావోయిస్టులు చంపేశారు.

కలకలం రేపిన మావోయిస్టుల లేఖ

ఇదిలా ఉండగా చత్తీస్ ఘడ్ సుక్మాజిల్లాలో మావోయిస్టులు వార్నింగ్ లేఖ విడుదల చేశారు. ఆటవీ సంపదను దోచుకోవడానికి కేంద్రం మావోయిస్టులపై దుశ్చర్యలకు పాల్పడుతుంఇన్ ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరు కాల్చి చంపిన మావోయిస్టులుఇన్ ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరు కాల్చి చంపిన మావోయిస్టులుదన్నారు. కొంట ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదలయ్యింది. దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.

Read More
Next Story