హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ ప్రతీకారచర్య
x

హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ ప్రతీకారచర్య

కాంట్రాక్టర్ ఇంతియాజ్ ను చిత్రహింసలు పెట్టి చంపేసిన మావోయిస్టులు


హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత చత్తీస్ గడ్ బీజాపూర్ లో మావోయిస్టులు ప్రతీకారచర్యలకు దిగుతున్నారు. బీజాపూర్ కు చెందిన మావోయిస్టులు ఇద్దరిని ఆదివారం కిడ్నాప్ చేసారు. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఇంతియాజ్ అనే కాంట్రాక్టర్ అసిస్టెంట్ తప్పించుకున్నాడు. కాగా ఇంతియాజ్‌ను సోమవారం తెల్లవారుజామున చిత్రహింసలు పెట్టి మావోయిస్టులు హతమార్చారు. ఇంతియాజ్ సహాయకుడిని మాత్రం వదిలేసారు. కలప వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దళ సభ్యుడి వల్లే హిడ్మా ఎన్ కౌంటర్ అయినట్లు మావోయిస్ట్ పార్టీ వికల్ప్ పేరిట విడుదల చేసిన లేఖలో పేర్కొంది. హిడ్మాకు ఆశ్రయం కల్పిస్తామని నమ్మబలికిన వీరు పోలీసులకు సమాచారం అందించడం వల్లే హిడ్మా చనిపోయినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే మార్చి వరకు మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆపరేషన్ కగార్ పేరిట భధ్రతబలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో , దండకారణ్యంలో జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాట్లు ఎక్కువయ్యాయి. ఎన్ కౌంటర్లలో అగ్రనేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. జనవరి నుంచి ఆయుధాలు త్యజిస్తామని, కాల్పుల విరమణ ప్రకటించాలని భద్రతాబలగాలను మావోయిస్టు పార్టీ కోరింది. ఆయుధాలను త్యజిస్తామని ప్రకటన చేసిన తర్వాత హిడ్మా ఎన్ కౌంటర్ కావడం మావోయిస్టు పార్టిని ఆత్మరక్షణలో పడేసింది. హిడ్మా ఎన్ కౌంటర్ వెనక ఎవరి హస్తముందో ప్రకటించిన తర్వాతే మావోయిస్టులు ప్రతీకారచర్యలకు దిగారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ హత్యతో మావోయిస్టు పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది.


Read More
Next Story