
హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం, 17 మంది మృతి
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. ఏసీ కంప్రెషర్ పేలడంతో భవనంలో మంటలతోపాటు పొగ వల్ల మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ గుల్లార్ హౌస్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మరణించారు. భవనం గదుల్లో నిద్రలో ఉండగా షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు.ఇరుకు గదిలో జరిగిన అగ్నిప్రమాదంతో వారు బయటపడేందుకు ఇబ్బంది ఏర్పడింది.ఒకే గదిలో 30 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల్లో సుమిత్ర(65),అభిషేక్ (30), ఆరూషి జైన్(17 ),హర్షాలీ గుప్తా (7), మున్సీబాయ్ (72), శీతల్ జైన్ (37), రాజేందర్ (67), ఇరాజ్ (2) మంది ఉన్నారు. మూడు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యశోదా, అపోలో ఆసుపత్రి,
గుల్జార్ హౌస్ ప్ర మాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం తీవ్ర ఆవేదన కలిగించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
— PMO India (@PMOIndia) May 18, 2025
మృతుల బంధువులకు పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా,గాయపడిన వారికి…