SEX Mania | ఎవరీ సెక్స్ మానియా మస్తాన్ సాయి! ఏమిటీ అరాచకం?
ఇతని పేరు మస్తాన్ సాయి.. ప్రవృత్తి మాత్రం మహిళల శరీరాలతో ఆడుకునే కామాంధుడు.. అమాయక మహిళల్ని మాయమాటలతో నమ్మించి వంచించడం ఇతడి నైజం..
ఇతని పేరు మస్తాన్ సాయి.. ప్రవృత్తి మాత్రం మహిళల శరీరాలతో ఆడుకునే కామాంధుడు.. అమాయక మహిళల్ని మాయమాటలతో నమ్మించి వంచించడం ఇతని నైజం.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కటకటాల వెనుక నక్కాడు. యువతుల జీవితాలను నాశనం చేసిన మస్తాన్ సాయి (SEX Mania Mastan Sai) కథ ఇది.
గుంటూరు జిల్లాకు చెందిన రావి మస్తాన్ సాయి కథలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్, గుంటూరు సహా పలు ప్రాంతాల్లో ఇతని ఆగడాలు పెద్ద సంచనాలుగా మారాయి.
హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. క్రూర మనస్తత్వం కలిగిన ఇతను యువతుల జీవితాలతో ఆటలాడుతూ, వారి నమ్మకాన్ని వమ్ముచేసిన దారుణ గాథ ఇది. గుంటూరు జిల్లాకు చెందిన రావి మస్తాన్ సాయి అనే కీచకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నయవంచకుని బారిన పడిన యువతులు, వివాహితుల జాబితా ఇప్పటికే 80కి చేరింది. మహిళల వ్యక్తిగత జీవితాలను చిద్రం చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం, వారి జీవితాలను అంధకారంలోకి నెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిందితుని తీరు ఉంది.
లావణ్య ఫిర్యాదుతో బట్టబయలైన సాయి బాగోతం
మస్తాన్ సాయి పాపం పండడానికి విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య (32) చేసిన ధైర్యం కారణమైంది. ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన తరువాత సాయి పాపాల చిట్టా వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి, తనతో పాటు మరికొందరికి మత్తుపదార్థాలు (డ్రగ్స్) ఇచ్చి, అసభ్యకరంగా ప్రవర్తించేలా ప్రేరేపించి, ఆ ఘోర దృశ్యాలను వీడియోలు తీసి భద్రపరచాడని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వీడియోలను దాచి తన లైంగిక వాంఛనలు తీర్చుకోవాలనుకున్నప్పుడల్లా వాటిని బయటపెట్టి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించేవాడని ఆరోపించారు.
హార్డ్ డిస్క్‌లో దాచిన రహస్యాలు...
లావణ్య ఇచ్చిన ఆధారాల ప్రకారం, మస్తాన్ సాయి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో దాదాపు 80 నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మస్తాన్ సాయితో పాటు యూట్యూబర్ ఖాజాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. మస్తాన్ సాయి సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి యువతుల ఫోన్లను హ్యాక్ చేసి, వారి వ్యక్తిగత వీడియోలను కొల్లగొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మస్తాన్ సాయికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు..
మస్తాన్ సాయి కేవలం బ్లాక్ మెయిల్ చేసే మానసిక రోగి మాత్రమే కాదు, డ్రగ్స్ మాఫియాతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడల్లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయి వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్ హ్యాక్ చేసి, నిఖిల్ వంటి ప్రముఖుల వ్యక్తిగత వీడియోలను సైతం తన చేతుల్లో పెట్టుకున్నాడని అనుమానిస్తున్నారు.
బాధితుల సంఖ్య గణనీయంగానే ఉండొచ్చు!
ప్రస్తుతం మస్తాన్ సాయి బాధితుల సంఖ్య 100కి పైగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అతని పాశవిక చర్యలు, యువతులను మానసికంగా వేధించిన పద్ధతులు వెలుగులోకి వస్తున్న కొద్దీ, సమాజం ఉలిక్కిపడుతోంది. ఇతని దురాగతాలకు బలైన ప్రతి బాధితురాలు తమ గాయాన్ని మౌనంగా భరిస్తూ, న్యాయం కోసం ఎదురు చూస్తోంది.
ఈ కేసులో మరొక ఆసక్తికర అంశం ఏమిటంటే, లావణ్యపై డ్రగ్స్ కేసు బనాయించాలని మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రయత్నించడం, ఈ ప్రమాదాన్ని గుర్తించిన లావణ్య వీరిపై పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. తాను పడ్డ బాధ మరొకరికి రాకూడదనే సంకల్పంతో, లావణ్య న్యాయం కోసం పోరాడుతోంది. గతంలో ఆమె సినీ నటుడు రాజ్ తరుణ్‌పై కూడా మోసగించాడని ఫిర్యాదు చేశారు. ఆ కేసు నేపథ్యంలోనే మస్తాన్ సాయి విషయంలో సంచలన నిజాలు బయటపడ్డాయి.
ఇంకా ఎంతమంది బలయ్యారు?
మస్తాన్ సాయి రాక్షసత్వానికి ఇంకా ఎంత మంది యువతులు బలయ్యారో తెలియదు. పోలీసులు బాధితులను ధైర్యంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. ఈ కేసుతో యువతులు, మహిళల భద్రతపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. మస్తాన్ సాయి నేరపూరిత సామ్రాజ్యం మరెన్ని చీకటి కోణాలు కలిగి ఉందో బయటపడాల్సి ఉంది.
మహిళలకు హెచ్చరిక!
ఈ ఘటన యువతులకు ఒక గుణపాఠంగా మారాలి. అపరిచితులపై పూర్తిగా నమ్మకం ఉంచడం ప్రమాదకరం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే, ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించాలి. మస్తాన్ సాయి అరెస్టు వెనుక సమాజాన్ని కుదిపేసే అనేక గుట్టుమట్లు ఉండే అవకాశముంది. విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి ఠాణాలో కేసు నమోదైంది.
ఎవరీ మస్తాన్ సాయి...
లావణ్య ఫిర్యాదు ప్రకారం...‘‘మస్తాన్‌సాయి బీటెక్ చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. అతను ఉనీత్‌రెడ్డి అనే స్నేహితుడి ద్వారా 2022లో పరిచయమయ్యాడు. యువతులు, వివాహితల్ని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు హ్యాక్ చేస్తాడు. గూగుల్, ఐ-క్లౌడ్‌లోని వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడతాడు. బాధితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగికవాంఛ తీర్చుకుంటాడు. వీడియోలు చిత్రీకరించి హార్డ్‌డిస్కులో దాచేస్తాడు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ను హ్యాక్ చేసి వీడియోలు సేకరించాడు. నటుడు నిఖిల్ ఫోన్‌లోని ప్రైవేటు పార్టీ వీడియోలు సైతం మస్తాన్ హార్డ్‌డిస్కులో ఉన్నాయి. మస్తాన్ సాయి నాకు తెలియకుండానే నా వ్యక్తిగత వీడియోలు తీశాడు. వీటి గురించి ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై గుంటూరు పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. మస్తాన్ సాయి ఆకృత్యాలున్న హార్డ్ డిస్కును గతేడాది నవంబరులో నేను తీసుకున్నా. దాంతో మా ఇంట్లోకి చొరబడి నాపై దాడి చేశాడు. నన్ను అంతం చేసి హార్డ్‌డిస్కు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు’’ అని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న లావణ్య మరోసారి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. శేఖర్‌బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని లావణ్య పేర్కొన్నారు. ఆడియో సంబంధిత ఆధారాలను పోలీసులకు ఆమె అందజేశారు. 140 గ్రాముల డ్రగ్స్ తన ఇంట్లో పెట్టి ఇరికించేందుకు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్‌సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడు.
బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే మస్తాన్ సాయి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫ్యాన్‌కి ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసినట్లు సమాచారం. సుమారు 100 మందికి పైగా మహిళలను ఇలా మోసగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. యువతులను మస్తాన్ సాయి అసభ్యంగా తిడుతూ మానసిక క్షోభకి గురిచేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ చేయనున్నారు.
Next Story