‘పని చేస్తున్నట్లు నటిస్తుంది ఎవరో నాకు తెలుసు’
x

‘పని చేస్తున్నట్లు నటిస్తుంది ఎవరో నాకు తెలుసు’

పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి. అలాంటి వారిపై చర్యలు తప్పవు.


తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కొత్త ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పనిచేస్తున్నట్లు నటిస్తున్నారో తనకు తెలుసని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజవర్గ అనుమంధ సంఘాలతో భేటీ నిర్వహించారు. ఇందులో మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కష్టపడాలన్నారు. పార్టీ కోసం పాకులారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని, గుర్తు పెట్టుకుంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి.. పార్టీ కార్యకలాపాలు, నేతలు నడవడికపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ అనుబంధ సంఘాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ నేతలతో జరిగిన సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో తమ పనితీరుపై నేతలు నివేదికలు అందించారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘‘మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటని తెలుసు. పని చేస్తుంది ఎవరు... యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు. పార్టీ కోసం సమయం ఇవ్వండి. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి. అలాంటి వారిపై చర్యలు తప్పవు. నా పనితీరు నచ్చకపోయినా... రాహుల్ గాంధీ...సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చు. కానీ బయట మాట్లాడకండి’’ అని దిశానిర్దేశం చేశారామే.

Read More
Next Story