
భాగ్యనగారికి చేరుకున్న మెస్సీ..
అర్జెంటీనా ఫుట్‌బాట్ స్టార్ లియోనెట్ మెస్సీ.. హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం దగ్గర అతనికి అభిమానులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నాడు మెస్సీ. అక్కడ వందమందితో మీ్ అండ్ గ్రీట్ సెషన్‌లో పాల్గొననున్నాడు. సాయంత్రం 6:30 గంటల సమయంలో మెస్సీ టీమ్ అంతా ఉప్పల్ స్టేడియంకు చేరుకోనున్నారు. మెస్సీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ చెకింగ్స్ కూడా చేపడుతున్నారు. మెస్సీ ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిర్వహిస్తున్నారు. మెస్సీ, రేవంత్ మధ్య జరిగే మ్యాచ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో ఈ గేమ్ కూడా స్టార్ట్ కానుంది.
మెస్సీ షెడ్యూట్ ఇదే..
రాత్రి 7.50కి ఉప్పల్ స్టేడియంలో మెస్సి- గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ మొదలవుతుంది.
రాత్రి 8.06కి సీఎం రేవంత్‌రెడ్డి, మెస్సి మైదానంలోకి దిగుతారు.
రాత్రి 8.08కి రోడ్రిగో, లూయిస్ సువారెజ్ మైదానంలోకి అడుగు పెడతారు.
రాత్రి 8.13కి పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు.
రాత్రి 8.18కి రాహుల్ గాంధీ మైదానంలోకి దిగుతారు.

