
రేవంత్ ఆతిధ్యానికి మెస్సీ ఫ్లాట్
బిర్యానీలో ఉపయోగించిన మసాలా ఘుమఘుమలకు మెస్సీ బృందం ఫ్లాట్ అయిపోయింది.
కడుపునిండా తృప్తికరమైన భోజనం పెడితే సంతోషించని వాళ్ళు ఎవరైనా ఉంటారా ? ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ విషయంలో కూడా అదే జరిగింది. భారత్ పర్యటనలో భాగంగా(Lionel Messi) మెస్సీ శనివారం హైదరాబాదులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) జట్టుతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కుటుంబంతో సహా హైదరాబాదుకు వచ్చిన మెస్సీకి రేవంత్ ప్రభుత్వం (falaknuma Palace)ఫలక్ నుమా ప్యాలెస్ లో బస ఏర్పాటుచేసింది. శనివారం రాత్రి రేవంత్ జట్టుతో మ్యాచ్ ఆడినతర్వాత మెస్సీ కుటుంబానికి రేవంత్ ప్యాలెస్ లోనే విందు ఇచ్చారు.
మెస్సీ కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ, హలీమ్ వడ్డించారు. చాలావంటకాలను వడ్డించినా మెస్సీ కుటుంబంతో పాటు ఆయన బృందం బిర్యానీ, హలీంను తెగ మెచ్చుకున్నారు. బృందంలోని కొందరు బిర్యానీ, హలీం ప్రత్యేకతలు, తయారీ విధానాన్ని తెలుసుకుంటే మరికొంతమంది రెండోసారి అడిగి మరీ వేయించుకుని తిన్నారు. బిర్యానీలో ఉపయోగించిన మసాలా ఘుమఘుమలకు మెస్సీ బృందం ఫ్లాట్ అయిపోయింది.
బిర్యానీ, హలీంతో పాటు నిజాం ప్రత్యేక వంటకాలైన మరగ్, పాయా, కబాబులు, పన్నీర్ టిక్కా, దాల్, నాన్ రోటీలు, ఖుబానీకా మీటా, బడల్ కా మీటా, మలాయ్ కుల్ఫీ, ఇటాలియన్ వంటకాలు కూడా వడ్డించారు. ప్యాలెస్ అందానికి మెస్సీ భలే ముచ్చటపడిపోయాడు. 101 మంది అతిధులు ఒకేసారి కూర్చుని భోజనంచేసే డైనింగ్ టేబుల్ ను చూసి మెస్సీతో పాటు తన బృందం హాశ్చర్యపోయింది. మళ్ళీ ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత తన బృందంతో కలిసి మెస్సీ ముంబాయ్ బయలుదేరారు.

